Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs DC: శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య ఊచకోత!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.

కూపర్ కానోల్లీ(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యన్ష్ షెద్గే(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.

ప్రియాన్ష్ ఆర్య ఊచకోత..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(18), ప్రియాన్ష్ ఆర్య అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ప్రభ్‌సిమ్రాన్ నెమ్మదిగా ఆడినా.. ప్రియాన్ష్ ఆర్య ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

IPL 2026 Shreyas Iyer and Priyansh Arya Fifties Propel PBKS to 210 5 Against Delhi Capitals

పవర్ ప్లే అనంతరం ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను ముఖేష్ కుమార్ ఔట్ చేయగా.. ప్రియాన్ష్ ఆర్య జోరుకు యువ ప్లేయర్ మాధవ్ తివారి బ్రేక్ వేసాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కూపర్ కానల్లీ ఆచితూచి ఆడారు. దాంతో పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. శ్రేయస్ అయ్యర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసినా బౌండరీలు బాదేందుకు తడబడ్డాడు.

మరోవైపు హాఫ్ సెంచరీ దిశగా సాగిన కానోల్లీని మనోజ్ తివారి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మార్కస్ స్టోయినీస్(1), శశాంక్ సింగ్(0)‌లను మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన సూర్యాన్ష్ షెద్గే(21 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.

Story first published: Monday, May 11, 2026, 21:52 [IST]
Other articles published on May 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+