PBKS vs MI: నిప్పులు చెరిగిన శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 201 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్(4/39), దీపక్ చాహర్(2/36) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. కార్బిన్ బోష్, రాజ్ బావకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఏకంగా 4 క్యాచ్‌లు వదిలేసారు. లేకుంటే పంజాబ్ ఇంకా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.
ప్రభ్‌సిమ్రాన్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బుమ్రా వేసిన రెండో ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నమన్ ధీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చెలరేగాడు.
దూకుడుగా ఆడేందుకు ఇబ్బంది పడిన ప్రియాన్ష్ ఆర్య(22)ను దీపక్ చాహర్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. భారీ సిక్స్‌లతో విరుచుకుపడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దెబ్బతీసిన శార్దూల్ ఠాకూర్..
దూకుడుగా ఆడుతున్న అతన్ని శార్దూల్ ఠాకూర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్(4)ను కూడా ఔట్ చేయగా.. కూపర్ కానోల్లీ(21)ని రాజ్ బవ పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో సూర్యాన్ష్ షెడ్గే(8)ను ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్.. పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు.
శశాంక్ సిగ్(2)ను కార్బిన్ బోష్ ఔట్ చేయగా.. శార్దూల్ ఠాకూర్ తన చివరి ఓవర్‌లో మార్కో జాన్సెన్(27)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ 160 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ అజ్మతుల్లా ఒమర్జాయ్ భారీ షాట్స్‌తో విరుచుకుపడ్డాడు. అతన్ని దీపక్ చాహర్ ఔట్ చేసినా.. ఇంపాక్ట్ ప్లేయర్ విష్ణు వినోద్ భారీ షాట్లతో జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు. విష్ణు వినోద్ ఇచ్చిన క్యాచ్‌లను రాబిన్ బింజ్, తిలక్ వర్మ వదిలేసారు. ఈ పిచ్‌పై ఇది తక్కువ స్కోరే అయినా ముంబై ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications