Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH: కావ్య మేడమ్.. బంగారం లాంటి బౌలర్‌ను వదిలేసారు!

ఐపీఎల్ 2026 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. గత సీజన్ తరహాలోనే పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే ప్రయత్నం టీమ్‌మేనేజ్‌మెంట్ చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు.

భారీ యాక్షన్ ప్రైజ్‌తో మినీవేలంలోకి వెళ్లినా.. కావాల్సిన బౌలర్లను కొనుగోలు చేయలేకపోయింది. పూర్తిగా దేశవాళీ బౌలర్ల‌పైనే ఖర్చు చేసింది. తీరా వారికి తొలి మ్యాచ్‌లో అవకాశమే ఇవ్వలేదు. ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మెరుగైన ప్రదర్శన చేసిన నటరాజన్‌ను కావ్య మారన్ కొనుగోలు చేయలేకపోయింది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ పేసర్ కోసం భారీ ఖర్చు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో నటరాజన్ నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోయినా.. అతని బౌలింగ్‌పై నమ్మకం ఉంచి రిటైన్ చేసుకుంది.

IPL 2026 In Search of Gold We Lost a Diamond SRH Owner Kavya Maran Trolled as T Natarajan Shines for DC

గతేడాది గాయాలతో బాధపడిన నటరాజన్.. ఈ సీజన్‌కు అన్ని విధాల సిద్దమయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే అసాధారణ బౌలింగ్‌తో సత్తా చాటాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన నటరాజన్ 7.25 ఎకానమీతో 29 ప రుగులే ఇచ్చి 3 వికెట్లు తీసాడు. 8 డాట్ బాల్స్ వేసాడు. ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, మహమ్మద్ షమీలను పెవిలియన్ చేర్చి లక్నో పతనాన్ని శాసించాడు.

నటరాజన్ అద్వితీయమైన ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఓవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు బాధపడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే వెలుగులోకి వచ్చిన నటరాజన్.. టీమిండియాకు కూడా ఆడాడు. యార్కర్ల నట్టూ తెలుగు అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

అయితే గాయాలతో ఆటకు దూరమైన అతను.. ఫామ్ కోల్పోయి మునపటిలా సత్తా చాటలేకపోయాడు. తమకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన నటరాజన్‌కు అండగా నిలవాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసింది. అతను తిరిగి మళ్లీ ఫిట్‌నెస్ సాధించడంతో పాటు మునపటిలా సత్తా చాటుతుండటంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయ్యో మన నట్టూ అని బాధపడుతున్నారు.

డైమండ్ వెతకబోయి బంగారాన్ని వదలుకున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. నటరాజన్‌ను కొనుగోలు చేయకుండా కావ్య మారన్ తప్పుచేసిందిన అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు జరిగే తమ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. కోల్‌కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టాలని ఇషాన్ కిషన్ సేన భావిస్తోంది.

Story first published: Thursday, April 2, 2026, 6:30 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+