Sara Tendulkar: వదిన-మరదళ్ల సందడి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, కోడలు సానియా ఛందోక్ హాజరయ్యారు. గ్యాలరీలో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈ వదిన-మరదళ్లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్.. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. అతని కనీస ధర రూ.30 లక్షలకు చెల్లించి తీసుకుంది. అయితే అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో ఆడే అవకాశం అయితే ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్‌లో కూడా అర్జున్ లేడు. దాంతో వాటర్ భాయ్‌గా అర్జున్ జట్టుకు సేవలందిస్తున్నారు.

వాటర్ బాటిల్స్ మోయడం చూసేందుకు వచ్చారా?
మరోవైపు సానియా ఛందోక్ లక్నో జెర్సీ వేసుకోగా.. సారా టెండూల్కర్ మాత్రం ఎలాంటి జెర్సీ ధరించలేదు. దాంతో ఆమె అర్జున్ టెండూల్కర్‌కు మద్దతు ఇచ్చేందుకు రాలేదని, తన ప్రియుడు శుభ్‌మన్ గిల్ కోసం వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సానియా చందోక్‌ను కూడా సారా టెండూల్కర్ తీసుకొచ్చిందని అంటున్నారు. అసలు లక్నోకు సపోర్ట్ చేయడానికి అర్జున్ టెండూల్కర్ ఏమైనా తుది జట్టులో ఆడుతున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. అర్జున్ వాటర్ బాటిల్స్ మోయడం చూసేందుకు వచ్చారా? అని సెటైర్లు పేల్చుతున్నారు.
గత రెండేళ్లుగా సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలను ఈ ఇద్దరూ ధృవీకరించలేదు. కానీ శుభ్‌మన్ గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరవ్వడం.. కొన్ని ఈవెంట్స్‌లో సీక్రెట్‌గా కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.
చిరు నవ్వులతో..
రెండు రోజుల క్రితమే సారా టెండూల్కర్ లక్నోకు చేరుకుంది. ఆ సమయంలోనే ఆమెను అభిమానులు.. ఎవరికి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ' మీ మద్దతు గుజరాత్ టైటాన్స్ జట్టుకా? లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కా?'అని ప్రశ్నించగా.. ముసి ముసి నవ్వులతో మౌనంగా వెళ్లిపోయింది. గత నెలలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ పెళ్లి అయిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ ఇద్దరూ.. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
సారా టెండూల్కర్ కంటే అర్జున్ టెండూల్కర్ చిన్నవాడు. కానీ ఆమె కంటే ముందే అర్జున్ ఓ ఇంటివాడయ్యాడు. శుభ్‌మన్ గిల్ కోసమే సారా వేచి చూస్తుందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications