Sara Tendulkar: సచిన్ కోడలికి తప్పని ఆడబిడ్డ పోరు..?
ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, కోడలు సానియా ఛందోక్‌లు సందడి చేస్తున్నారు. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) మ్యాచ్‌లకు హాజరవుతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌తో పాటు బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌కు ఈ ఇద్దరూ హాజరయ్యారు.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం లేకపోయినా.. ఈ ఇద్దరూ ఆ జట్టుకు మద్దతుగా గ్యాలరీలో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సానియా ఛందోక్ లక్నో జెర్సీతో హాజరవుతుండగా.. సారా మాత్రం మాములు న్యూట్రల్ సెలెబ్రిటీలా మ్యాచ్‌కు వస్తుంది. టీవీ కెమెరాలు పదే పదే ఈ ఇద్దర్ని చూపిస్తుండటంతో వారి మ్యాచ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఐపీఎల్‌లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులకు అనుమతి ఉండటంతో ఈ ఇద్దరూ జట్టుతో కలిసే ప్రయాణిస్తున్నారు. గత నెలలో అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ పెళ్లి అయిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొద్ది రోజులకే ఐపీఎల్ మొదలవ్వడంతో అర్జున్ సానియా ఛందోక్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల సతీమణులకు అనుమతి ఉండటంతో సానియా ఛందోక్ అర్జున్‌తో ఉండేందుకు జట్టుతో ప్రయాణిస్తోంది. తనకు తోడుగా తన స్నేహితురాలు, వదిన అయిన సారా టెండూల్కర్‌ను తెచ్చుకుంది.
అయితే ఈ ఇద్దరూ ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవ్వడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'అర్జున్ టెండూల్కర్ వాటర్ బాటిల్స్ మోయడం చూసేందుకు ఈ వదిన మరదళ్లు వస్తున్నారా?అని ఒకరంటే.. సానియా ఛందోక్‌తో సారా ఎందుకు వస్తుంది? కొత్త పెళ్లి జంటకు కాస్త ప్రైవసీ ఇవ్వవచ్చు కదా? అని మరొకరు కామెంట్ చేశారు. సచిన్ కోడలకు కూడా ఆడబిడ్డ పోరు తప్పడం లేదా? అని మరో నెటిజన్ సెటైర్ పేల్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అతని కనీస ధర రూ.30 లక్షలకు చెల్లించి తీసుకుంది. అయితే అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో ఆడే అవకాశం అయితే ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్‌లో కూడా అతని పేరు లేదు. దాంతో వాటర్ భాయ్‌గా అర్జున్ జట్టుకు సేవలందిస్తున్నాడు. బీసీసీఐ తెచ్చిన నయా రూల్‌తో అతనికి మైదానంలోకి కూడా అనుమతి లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications