Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanju Samson: శతక్కొట్టిన చేట.. ధోనీకి సాధ్యం కానీ రికార్డ్ సొంతం!

చెన్నై సూపర్ కింగ్స్(CSK) స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో(6, 7, 9) తీవ్రంగా నిరాశపర్చిన సంజూ.. నాలుగో మ్యాచ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో ఆ జోరును కొనసాగించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

కానీ ఈ విమర్శలకు తన బ్యాట్‌తో బదులిచ్చాడు. విధ్వంసకర శతకంతో నోళ్లు మూయించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సంజూ.. క్లాస్ షాట్స్‌తో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అదే జోరు కొనసాగించిన సంజూ శాంసన్.. 52 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఈ సీజన్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. సంజూ విధ్వంసకర శతకానికి ఫిదా అయిన ఫ్యాన్స్.. చేట నువ్వు సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.

IPL 2026 Sanju Samson Scripting History for CSK Achieves Record MS Dhoni Never Managed

ధోనీకి సాధ్యం కానీ రికార్డు

ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌కు ఇది నాలుగో సెంచరీ. అతను చివరిసారిగా 2021లో సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరఫున తొలి శతకం బాదిన సంజూ.. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండో సెంచరీ, 2021లో పంజాబ్ కింగ్స్‌పై మూడో శతకాన్ని నమోదు చేశాడు. తాజా సెంచరీతో మొత్తం నాలుగు శతకాలను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక సెంచరీతో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీకి సాధ్యం కానీ ఈ రికార్డును సంజూ శాంసన్ అందుకున్నాడు. అంతేకాకుండా మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా సంజూ శాంసన్ చరిత్రకెక్కాడు. అతను ఢిల్లీ డేర్ డేవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే తరఫున శతకాలు నమోదు చేశాడు.

సీఎస్‌కే భారీ స్కోర్..

సంజూ శాంసన్ శతకంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజూతో పాటు ఆయుష్ మాత్రే(36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు. ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Saturday, April 11, 2026, 21:37 [IST]
Other articles published on Apr 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+