IPL 2026: మలుపు తిప్పిన ఓవర్టన్.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. శనివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. సంజూ శాంసన్ అజేయ శతకంతో.. జెమీ ఓవర్టన్(4/18) అద్భుత బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ఆయుష్ మాత్రే(36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో189 పరుగులకు ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. పాతుమ్ నిస్సంక(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) దూకుడుగా ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, గుర్జప్‌నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.
మలుపు తిప్పిన జెమీ ఓవర్టన్..
213 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించింది. అయితే జెమీఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ(6), డేంజరస్ డేవిడ్ మిల్లర్, ఆకీబ్ నబీతో పాటు క్రీజులో సెట్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ఓవర్టన్ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా స్టబ్స్-మిల్లర్ నెలకొల్పిన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు.
ముఖ్యంగా డేవిడ్ మిల్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఓవైపు వరుసగా వికెట్లు కోల్పోయినా.. మరోవైపు స్టబ్స్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అతన్ని కూడా ఓవర్టనే ఔట్ చేసి చెన్నై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications