Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా మాటలు కోహ్లీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించవచ్చు.. కానీ నిజం ఇదే: సంజయ్ మంజ్రేకర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్ గురించి వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో వేగం పెరిగిందని, స్ట్రైక్‌రేట్ మెరుగైందని అభిప్రాయపడ్డాడు.

గతంలో విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లను నమ్మేవాడు కాదని, ఇన్నింగ్స్ మొత్తం తానే ఆడాలనుకునేవాడని చెప్పాడు. దాంతోనే కోహ్లీ స్ట్రైక్‌రేట్ చాలా తక్కువగా ఉండేదని చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్ పెరగడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

'నా మాటలు మళ్లీ విరాట్ కోహ్లీ అభిమానులకు కోపం తెప్పించవచ్చు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు భిన్నంగా.. అద్భుతంగా ఉంది. అతను 140-150 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. కోహ్లీలో ఏం మారలేదు. అతను కేవలం వేగంగా ఆడాలని నిర్ణయించుకున్నాడు అంతే. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే.. తన స్లో బ్యాటింగ్‌పై వచ్చిన విమర్శలతో ఒత్తిడి పెరిగిందనే విషయాన్ని కోహ్లీ గ్రహించాడు. మూడు, నాలుగు ఏళ్ల క్రితం కోహ్లీ స్ట్రైక్‌రేట్ 125-130గా ఉండగా.. ఇప్పుడు 150కి పెరిగింది.

IPL 2026 Sanjay Manjrekar Sparks Debate Claims Kohli s Shift in Strike Rate is Driven by Pressure

గతంలో విరాట్ కోహ్లీ ఒక బౌండరీ కొట్టిన తర్వాత సింగిల్స్, డబుల్స్ తీయడానికి ప్రయత్నించేవాడు. ఎందుకంటే ఇన్నింగ్స్ మొత్తం తానే ఆడాలనుకునేవాడు. తన తర్వాత వచ్చే బ్యాటర్లపై నమ్మకం ఉంచేవాడు కాదు. కానీ, ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా దూకుడుగా ఆడటం ప్రారంభించాడో.. జట్టులో తాను తప్ప మరే ఆటగాడు రాణించలేడనే భావన నుంచి బయటపడ్డాడో.. అప్పుడే ఆర్‌సీబీ జట్టులో మార్పు వచ్చింది. అతను వేగంగా ఆడటం వల్లే మిగిలిన బ్యాటర్లు కూడా రాణించగలిగారు.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ 8 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 58.50 సగటు, 162.50 స్ట్రైక్‌రేట్‌తో 351 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Tuesday, April 28, 2026, 17:54 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+