Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని సహకారంతోనే కోహ్లీని ఔట్ చేశా: సాకిబ్ హుస్సేన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం తన కల అని, అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ అన్నాడు. తమ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ సహకారంతోనే ఈ వికెట్ తీయగలిగానని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 55 పరుగుల భారీ తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(15)ని సాకిబ్ హుస్సేన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసాడు.

వరుణ్ భాయ్ చెప్పడంతో..

ఈ మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడిన సాకిబ్ హుస్సేన్.. స్లోయర్ బాల్స్ గ్రిప్ అవ్వడంతో వాటినే తన అస్త్రంగా మార్చుకున్నానని తెలిపాడు. 'మా బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ మాకు ఏం చెప్పారో.. దాన్ని అలాగే అమలు చేయడమే మా ప్లాన్. వికెట్ ఎలా ఉందో అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ముందుగా చర్చించుకున్న వ్యూహాలనే నేను మైదానంలో అమలు చేశాను.

వికెట్‌పై బంతి కొద్దిగా గ్రిప్ అయ్యింది. దాంతో నేను ఎక్కువగా స్లోయర్ బాల్స్ వేసాను. అవి పిచ్‌పై కాస్త ఆగి రావడంతో నా ప్లాన్ పక్కాగా వర్కవుట్ అయింది. విరాట్ కోహ్లీ వికెట్ తీయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కోహ్లీని ఔట్ చేయాలనేది నా డ్రీమ్.

IPL 2026 Sakib Hussain Reveals How Varun Aaron s Masterplan Guided Him to His Dream Wicket of Virat Kohli
Photo Credit: screen grab for JioHotstar

మాకు మంచి అవకాశం..

పిచ్‌పై స్లోయర్ బాల్స్ బాగా గ్రిప్ అవుతున్నాయని వరుణ్ భాయ్ మాకు చెప్పారు. అందుకే ఆ ప్లాన్‌కే కట్టుబడి ఉంటే మంచి ఫలితం ఉంటుందని భావించాం. ప్రస్తుతం నా దృష్టి అంతా బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడం పైనే ఉంది. నేను ఎంత బాగా మెరుగైతే.. మా జట్టుకు అంత మంచి జరుగుతుంది.

ప్లే ఆఫ్స్ చేరిన మాకు టైటిల్ గెలిచేందుకు ఇది మంచి అవకాశం. మేం మైదానంలో మా నూటికి నూరు శాతం శ్రమను పెడతాం. రాబోయే మ్యాచ్‌ల్లో చాలా బాగా రాణిస్తామని ఆశిస్తున్నాను.'అని సాకిబ్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.

SRH ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆర్‌సీబీ బౌలరలో రసీక్ సలామ్(2/55) రెండు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ(1/36), కృనాల్ పాండ్యా(1/24) చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/33) రెండు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లకు తలో వికెట్ దక్కింది.

Story first published: Saturday, May 23, 2026, 6:05 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+