Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: రఫ్ఫాడించిన రబాడ.. చిత్తుగా ఓడిన చెన్నై!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత మరో విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో రబడా నిప్పులు చెలరేగగా.. బ్యాటింగ్‌లో లోకల్ భాయ్ సాయి సుదర్శన్ చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/25)మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్‌కు చెరో వికెట్ దక్కింది.

IPL 2026 Sai Sudharsan Unbeaten 87 and Kagiso Rabada 3 wickets Haul Helps GT Beat CSK by 8 wickets

అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 33), జోస్ బట్లర్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్)రాణించారు. నూర్ అహ్మద్, అకీల్ హుసేన్ చెరో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో పరాజయం.

నిప్పులు చెరిగిన రబాడ..

గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ అద్భుతమైన బౌలింగ్‌తో సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేను పవర్ ప్లేలోనే దెబ్బతీసాడు. ఆచితూచి ఆడిన సంజూ శాంసన్(11)‌తో పాటు ఉర్విల్ పటేల్(4)‌లను ఓకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. చివర్లో దూకుడుగా ఆడిన కార్తీక్ శర్మ(15)ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో సీఎస్‌కే కోలుకోలేకపోయింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు దూకుడుగా ఆడకపోవడంతో సీఎస్‌కే భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయింది. టార్గెట్ చిన్నది కావడంతో గుజరాత్ టైటాన్స్ ఆచితూచి ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది.

Story first published: Sunday, April 26, 2026, 19:23 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+