వైభవ్ సూర్యవంశీలో నాకు నచ్చేది అదే: సచిన్ టెండూల్కర్
రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటర్ అని కితాబిచ్చాడు. అతనిలో నాకు బాగా నచ్చేది అతని మణికట్టు పనితనమేనని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు.
ప్లే ఆఫ్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 97, 96 పరుగులతో చెలరేగిన బుడ్డోడు.. తృటిలో శతకాలు చేజార్చుకున్నాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన సచిన్ అతని బ్యాటింగ్ సక్సెస్ సీక్రెట్ వెల్లడించాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డుల వేడుకలో వైభవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
'వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో నన్ను అత్యంత ఆకట్టుకున్న విషయం అతని అద్భుతమైన మణికట్టు పనితనం. అతను బంతిని మైదానం వెలుపలికి పంపడానికి కేవలం బలాన్ని నమ్ముకుని గుడ్డిగా షాట్స్ ఆడటం లేదు. మిగతా బ్యాటర్ల కంటే చాలా ముందే బంతి లైన్ అండ్ లెంగ్త్‌ను అతను అంచనా వేస్తున్నాడు. అందుకే అంత టైమింగ్‌తో షాట్స్ ఆడగలుగుతున్నాడు. ఈ టెక్నిక్‌తో 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి అత్యుత్తమ వేదికపై వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు.

'నేను అతనికి కేవలం తన సహజసిద్ధమైన శైలిలోనే ఆడమని చెబుతాను. దేనికైనా ఒక మొదటిసారి అంటూ ఉంటుంది. వయసుతో పాటు టెస్ట్ క్రికెట్‌లో వచ్చే రకరకాల సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అతను నెమ్మదిగా నేర్చుకుంటాడు. అతను చూస్తుంటే చాలా ఆత్మవిశ్వాసంతో.. తను ఏం చేయాలనుకుంటున్నాడో దానిపై పూర్తి స్పష్టతతో ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడు. నేను అతని సహజసిద్ధమైన ఆటతీరులో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడను.
ఎందుకంటే అతను బంతిని చూసే విధానం, దానికి స్పందించే తీరు చాలా ప్రత్యేకమైనవి. ఒకవేళ మనం అతని మధ్యలో ఎన్నో అడ్డంకులు సృష్టించి, ఇది చెయ్ అది చెయ్ అంటూ రకరకాల విషయాలు చెప్పి ఆ సహజమైన సంకేతాన్ని అడ్డుకుంటే.. అక్కడే అసలైన సమస్య మొదలవుతుంది.'అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో48.50 సగటు, 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసాడు. ఈ సీజన్‌లో మొత్తం 72 సిక్స్‌లు బాది ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కానీ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications