ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది: సచిన్ టెండూల్కర్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం విచిత్రంగా ముగిసింది. టోర్నీ ఫస్టాఫ్‌లో 7 మ్యాచ్‌లకు 6 గెలిచిన పంజాబ్ కింగ్స్.. మరో మ్యాచ్ రద్దవ్వడంతో 13 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా సరికొత్త రికార్డ్‌ను లిఖించింది. కానీ తర్వాతి 7 మ్యాచ్‌ల్లో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
పంజాబ్ కింగ్స్ వైఫల్యానికి గల కారణాన్ని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రెడిట్‌లో వెల్లడించాడు. ఫస్టాఫ్ టోర్నీలో పంజాబ్ ప్రక్రియను నమ్ముకుంటే.. సెకండాఫ్‌లో ఫలితాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి మూల్యం చెల్లించుకుందన్నాడు.

'పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీకి మంచి ఊపును తీసుకొచ్చింది. వారి క్రికెట్ సానుకూలంగా.. ధైర్యంగా.. ఆట స్వరూపాన్నే మార్చేసేలా సాగింది. సుదీర్ఘమైన టోర్నీల్లో మూమెంటమ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా సాగే టోర్నీలో అంతా ప్రక్రియపైనే ఆధారపడి ఉంటుంది తప్ప ఫలితాలకు ఎక్కువగా కట్టుబడిపోకూడదు. పంజాబ్ జట్టు ఫస్టాఫ్‌లో ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టగా.. సెకండాఫ్‌లో ఫలితాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.'అని సచిన్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ చాలా నిలకడగా రాణించిందని సచిన్ కొనియాడాడు. 'గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. ఈ సీజన్ మొత్తం ఒకే తరహాలో ప్రదర్శన కనబర్చింది. ఐపీఎల్‌లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ గుజరాత్ ఫలితాలు అటు ఇటుగా మారినా.. ఆ జట్టు తమ ఆటతీరును మాత్రం మార్చుకోలేదు. ఫలితాలతో సంబంధం లేకుండా చాలా నిలకడగా రాణించారు. సుదీర్ఘ టోర్నీలో అప్పుడప్పుడు మెరుపు ప్రదర్శనలు చేయడం లేదా ఏదో ఒక మ్యాచ్‌లో ఒంటరి పోరాటంతో గెలవడం కంటే.. ఇలాంటి అనిశ్చితిని నియంత్రించే సామర్థ్యమే చాలా విలువైనదిగా నిలుస్తుంది.
ఈ సీజన్‌లోనూ పాయింట్స్ టేబుల్‌లో జట్లు మారాయి. ఫస్టాప్ సమయంలో ఉన్నపాయింట్స్ టేబుల్.. టోర్నీ ముగిసే సరికి వేరుగా కనిపించింది. టోర్నీ సాగుతున్న కొద్దీ జట్లు తమ ఆటను మెరుగుపర్చుకున్నాయి.'అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications