Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయుడి లోటును భర్తీ చేయలేకపోయాం.. SRH మా కొంపముంచింది: రుతురాజ్ గైక్వాడ్

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో సునాయసంగా గెలవాల్సిన రెండు మ్యాచ్‌లను చేజేతులా చేజార్చుకున్నామని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు. ఈ పరాజయాలే టోర్నీ నుంచి తమను నిష్క్రమించేలా చేశాయని అభిప్రాయపడ్డాడు. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచి ఉంటే టోర్నీలో ముందడుగు వేసేవాళ్లమని చెప్పుకొచ్చాడు.

అంబటి రాయుడితో పాటు అజింక్యా రహానేల లోటును తాము భర్తీ చేయలేకపోయామని తెలిపాడు. కీలక దశలో ఓవర్టన్, ముఖేష్ చౌదరి గాయపడటం తమ జట్టును దెబ్బతీసిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సీఎస్‌కే 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

గుజరాత్ బాగా ఆడింది..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో తమను చిత్తు చేసిందని అంగీకరించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ కంటే మెరుగైన ప్రదర్శన చేశారని కొనియాడాడు. 'లక్ష్యం ఎంత ఉన్నా సరే.. దానిని వీలైనంత త్వరగా ఛేదించాలనే మేం అనుకున్నాం. అయితే 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సులువు కాదు.

మరీ ముఖ్యంగా బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుపై గెలవడం చాలా కష్టం. అయినా సరే, ఎందుకు ప్రయత్నించకూడదు? మన ఆటను స్వేచ్ఛగా ఎందుకు ఆడకూడదు? అని భావించాం. కానీ క్రెడిట్ అంతా గుజరాత్ జట్టుకే దక్కుతుంది. మ్యాచ్ ప్రారంభంలో వికెట్ కొద్దిగా స్పాంజీగా ఉంది. కానీ వారు చాలా అద్భుతంగా ఆడారు.

IPL 2026 Ruturaj Gaikwad Opens Up on Missing Rayudu s Experience and SRH Regrets After Elimination
Photo Credit: screen grab for JioHotstar

మా బౌలింగ్ పవర్‌ప్లేలో అస్సలు బాలేదు. వారి ఓపెనర్లను అడ్డుకోలేకపోయాం. వారిని 200 పరుగుల లోపే కట్టడి చేసే అవకాశం మాకు వచ్చింది. కానీ మేం అలా చేయడంలో విఫలమయ్యాం. టోర్నీ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది.

ఆ తర్వాత మేం ఫామ్‌ను అందుకొని, కాంబినేషన్‌ను సెట్ చేసుకున్నాం. కానీ అంతలోనే గాయాల బారిన పడ్డాం. ముఖేష్ చౌదరి, ఓవర్టన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని బాగా దెబ్బతీసింది. దాంతో గత మూడు మ్యాచ్‌ల్లో మేం ఒక బ్యాటర్ లేదా బౌలర్ లేకుండా ఆడాల్సి వచ్చింది.

SRH మా కొంపముంచింది..

ప్రస్తుతం మా జట్టు ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉంది. మా జట్టులో చాలా మంది అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు. 8 నుంచి 10 మంది ఆటగాళ్లు 20 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడినవారే. వారికి ఇప్పుడు మంచి ఎక్స్‌పోజర్ దొరికింది. అలాగే మేం ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నామో కూడా మాకు అర్థమైంది. అయినా సరే.. మేం ఈ సీజన్‌లో హోమ్ గ్రౌండ్ బయట ఆరు మ్యాచ్‌లు గెలిచాం. మా జట్టును చూసి నేను గర్వపడుతున్నాను.

హైదరాబాద్‌లో 10 ఓవర్లలో 80 పరుగులు ఛేదించలేకపోయాం.. అలాగే చెన్నైలో వారిని తక్కువ పరుగులకే నియంత్రించలేకపోయాం. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయినా సరే మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగానే ఉంది.

ధోనీ భవిష్యత్తు ఏంటనేది..

రహానే, రాయుడు వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు వెళ్ళిపోయాక వారి లోటును భర్తీ చేయలేకపోయాం. ప్రస్తుతం కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్.. ప్రారంభంలో మ్యాచ్‌లు ఆడని డెవాల్డ్ బ్రెవిస్ వంటి వారు జట్టులో ఉన్నారు. కార్తీక్‌లో మంచి పొటెన్షియల్ ఉంది. అతను మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఉర్విల్ మొదటిసారి పూర్తి సీజన్ ఆడాడు. ఆ ఆటకు కొన్ని అంచనాలు తోడవుతాయి.

ధోనీ భవిష్యత్తు ఏంటనేది మీకు, నాకు వచ్చే ఏడాది తెలుస్తుంది. అతని లోటు మాకు చాలా పెద్దది. అతను కేవలం క్రీజులో నిలబడితేనే.. చివరి ఓవర్లలో వచ్చి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేయగలడు. వచ్చే సీజన్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం కానీ, ప్రస్తుతానికి మాకున్న ఆటగాళ్ల పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 22, 2026, 0:07 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+