అతని రాకతో మా కాంబినేషన్ సెట్ అయ్యింది: రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో డేవాల్డ్ బ్రేవిస్ చేరికతో తమ టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యిందని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధించిన గత విజయం కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పాడు. గత మ్యాచ్ తరహాలోనే జైత్రయాత్రను కొనసాగిస్తామని తెలిపాడు. చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ సందర్భంగా మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'టాస్ గెలిస్తే మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి టాస్ గెలిచినా ఓడినా ఒరిగేది ఏం లేదు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ నమోదు చేయడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. కానీ ఇది మంచి బ్యాటింగ్ పిచ్‌లా కనిపిస్తోంది. గత మ్యాచ్ విజయం మాకు కొండంత బలాన్నిచ్చింది.

పట్టిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 210 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మా ఫీల్డింగ్ విభాగం కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఆ మ్యాచ్‌లో మేం కొన్ని పరుగులను అడ్డుకున్నాం. సమష్టిగా రాణించాం. ఈ రోజు కూడా అదే తరహాలో రాణించాలని అనుకుంటున్నాం. మేం నెమ్మదిగా సరైన కాంబినేషన్‌ను సెట్ చేసుకుంటున్నాం. డెవాల్డ్ బ్రెవిస్ తిరిగి రావడం.. జేమీ ఓవర్టన్ మిడిల్ ఓవర్లు వేయడం మాకు కలిసి వస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా రాణించడం ముఖ్యం. మేం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ' మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత మ్యాచ్‌లో మేం బాగా రాణించాం. కానీ దురదృష్టవశాత్తు ఓటమిపాలయ్యాం. కానీ మేం ఆడిన విధానం మా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనపై మనకు నమ్మకం ఉండాలి.
టీ20 ఫార్మాట్‌లో చిన్న చిన్న క్షణాలు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో బంతితో బాగా రాణించి, ఆపై లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాం. గత మ్యాచ్‌లో ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడాడు. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఏం చేయలేం. మెగా వేలం తర్వాత మా టీమ్ కాంబినేషన్ దెబ్బతిన్నది. గాయాలు, ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. తుది జట్టులో ఒక మార్పు చేశాం. వరుణ్ చక్రవర్తీ రీఎంట్రీ ఇశ్వగా.. నవ్‌దీప్ సైనీ ఉద్వాసనకు గురయ్యాడు.'అని రహానే చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):
అజింక్యా రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications