For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: అందుకే వేలంలో కుర్రాళ్లను కొనుగోలు చేశాం: రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. పిచ్‌పై గంటలకొద్దీ కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

'ఇక్కడ వర్షం పడుతోంది. ఇది ఎర్ర మట్టి పిచ్ అయినప్పటికీ వర్షం ప్రభావం ఉంటుంది. పిచ్‌పై మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. కెప్టెన్సీ చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. 17 ఏళ్ల కుర్రాడి స్థాయి నుంచి కెప్టెన్‌గా ఎదగడం గర్వంగా ఉంది. తోటి ఆటగాళ్లు అంతా నాకు అండగా నిలవడం సంతోషంగా ఉంది. మా ఏకైక లక్ష్యం టైటిల్ గెలవడమే. వేలం, ట్రేడింగ్ ద్వారా మేం తెలివైన ఆటగాళ్లను, ఆల్‌రౌండర్లను జట్టులోకి తెచ్చుకున్నాం. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడే ప్రయత్నం చేస్తాం. మా ఓవర్‌సీస్ ఆటగాళ్లు నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, డొనోవన్ ఫెరీరా, షిమ్రాన్ హెట్మెయర్ బరిలోకి దిగుతున్నారు.'అని రియాన్ పరాగ్ తెలిపాడు.

IPL 2026 Ruturaj Gaikwad Explains CSK s Bold Strategy of Buying Youngsters Following Last Season s Struggles

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. వేలంలో కుర్రాళ్లను కోనుగోలు చేయడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. 'వర్షం, ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది మా ప్రదర్శన ఆశించిన రీతిలో లేదు. అందుకే పక్కా వ్యూహంతో వేలంలోకి వెళ్లి జట్టు కల్చర్‌కు సరిపోయే ఆటగాళ్లను తీసుకున్నాం.

మాకు ఉన్న ఆప్షన్లలో కుర్రాళ్లే బెస్ట్ అనిపించింది. వారినే జట్టులోకి ఆహ్వానించాం. వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నాం. మా ఆక్షన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నాను. మా ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా మాట్ షార్ట్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ ఆడుతున్నారు. ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగుతున్నాం. పఒకవేళ మాకు మంచి స్టార్ట్ లభిస్తే, ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడుకుంటాం.'అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, సంజూ శాంసన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇన్నాళ్లు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన సంజూ శాంసన్.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతుండగా.. చెన్నైకి ఆడిన రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.

తుది జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్:
సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్.

రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

Story first published: Monday, March 30, 2026, 19:33 [IST]
Other articles published on Mar 30, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+