Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పవర్ ప్లే‌నే మా కొంపముంచింది: రుతురాజ్ గైక్వాడ్

పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. పిచ్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. 170-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.

పవర్ ప్లే‌లోనే..

'నిజం చెప్పాలంటే.. ఈ పిచ్‌ను అంచనా వేయడం చాలా కష్టమైంది. ముఖ్యంగా మీడియం పేసర్ల బౌలింగ్‌లో బంతి ఆగి వచ్చింది. అనూహ్య బౌన్స్ ఉంది. పవర్‌ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోకుండా ఉంటే 170-180 పరుగులు చేసేవాళ్లం. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పిచ్ ప్రవర్తించిన తీరు చాలా భిన్నంగా ఉంది. మేం పరిస్థితులకు అలవాటు పడేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నేను దూకుడుగా ఆడాలని ప్రయత్నించాను. కానీ బంతి అనూహ్యమైన బౌన్స్‌తో వస్తుండటంతో ఇబ్బంది పడ్డాను. ప్రతి బంతికి శైలిని మార్చుకోవడం కష్టమైంది. ఫీల్డింగ్‌లో కూడా మేం కాస్త అలసత్వంగా ఉన్నాం. నా బ్యాటింగ్ విషయానికొస్తే.. మంచి ఆరంభం లభించినా వికెట్లు పడుతుండటంతో భాగస్వామ్యంపై దృష్టి పెట్టాను. స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టమైంది. చివరి 5-6 ఓవర్లలో ఎలాగైనా వేగం పెంచాలని ప్రయత్నించాను.

IPL 2026 Ruturaj Gaikwad Blames Powerplay Wickets and Sticky Pitch for CSK s Loss to Gujarat Titans

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముందుగా ముకేష్ చౌదరిని ఆడించాలనుకున్నాం. కానీ పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో నాలుగో ఓవర్‌లోనే బ్యాటర్‌ను తీసుకోవాల్సి వచ్చింది. మా ప్రణాళిక సరిగ్గా ఉన్నా.. ఆశించిన ఫలితం దక్కలేదు. వీలైనంత త్వరగా ఈ ఓటమిని మర్చిపోయి తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

ఐదో ఓటమి..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/25)మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్‌కు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 33), జోస్ బట్లర్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్)రాణించారు. నూర్ అహ్మద్, అకీల్ హుసేన్ చెరో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో పరాజయం.

Story first published: Sunday, April 26, 2026, 20:38 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+