Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ!(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ నోట తెలుగు మాట రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ తెలుగు బిడ్డ.. మావోడేనని పేర్కొంటున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌‌ను ఘనంగా ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. న్యూఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. అయితే గతేడాది న్యూఢిల్లీ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు గాలిదుమారం అంతరాయం కలిగించింది. ఆ సమయంలో రోహిత్ శర్మ తన సహచర ఆటగాళ్లను మైదానం నుంచి బయటకు రావాలని కమ్ బ్యాక్ అని గట్టిగా అరిచాడు. ఆ వీడియో త్రో బ్యాక్ అని ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

IPL 2026 Rohit Sharma Says Ikkadena in MI Video Ahead of DC Clash Clip Goes Viral

అయితే ఆ ఘటనను ముంబై ఇండియన్స్ టీమ్ కెమెరామెన్ రోహిత్ శర్మకు గుర్తు చేశాడు. 'రోహిత్ భాయ్.. కమ్ బ్యాక్ అనే ఘటన గుర్తుందా?'అని మరాఠిలో అడిగాడు. దానికి రోహిత్ శర్మ 'అది ఇక్కడేనా' అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఇక్కడేనా అనే పదంపై తీవ్ర చర్చ జరుగుతుంది. అది తెలుగు పదమని, రోహిత్ తెలుగోడని రోహిత్ ఫ్యాన్స్ అంటుంటే.. అది మరాఠీ వర్డ్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రోహిత్ శర్మ తెలుగు మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను తెలుగు మాట్లాడాడు. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ తెలుగువారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. రోహిత్ శర్మ తన మాతృభాష తెలుగు అని కూడా చెప్పాడు. తండ్రి మరాఠి వ్యక్తి అయినా.. తల్లి ద్వారా రోహిత్‌కు తెలుగు తెలుసు. అప్పుడప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. జట్టులో తెలుగువాడైన తిలక్ వర్మతో రోహిత్ అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుతుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. వరుసగా 13 సీజన్ల తర్వాత ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా విజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది.

Story first published: Saturday, April 4, 2026, 15:19 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+