Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఓటమి బాధలో ఉన్న ముంబైకి బిగ్ షాక్.. గాయంతో రోహిత్ ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం వాంఖడే మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా తొడ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసిందే.

ఈ గాయం నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ గాయం తీవ్రత తెలుసుకునేందుకు ముంబై ఇండియన్స్ మెడికల్ టీమ్ అతనికి స్కానింగ్ పరీక్షలు చేయించింది. ఈ టెస్ట్ ఫలితాలు ఇంకా రాలేదని, ఈ రిపోర్ట్‌లపైనే రోహిత్ శర్మ భవితవ్యం ఆధారపడి ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రోహిత్ 2-3 వారాలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే... ముంబై ఇండియన్స్ ఆడే తదుపరి మూడు మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉండడు. అసలే వరుస పరాజయాలతో చతికిల పడిన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ గైర్హాజరీతో కష్టాలు రెట్టింపు అవ్వనున్నాయి.

IPL 2026 Rohit Sharma Injury Scare Compounds Mumbai Indians s Woes After Hat-Trick of Defeats

రోహిత్ గాయం కారణంగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతర్జాతీయ టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారాడు. అయినా అతను తొడకండరాల గాయానికి గురవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

గతంలోనూ రోహిత్ శర్మ ఇదే గాయంతో అనేకసార్లు ఇబ్బంది పడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా గాయంతో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ చేసిన అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. అయితే కోహ్లీ గాయంపై ఎలాంటి సమాచారం అందలేదు. అతనిది స్వల్ప గాయమేనని, తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరుగుతుంది.

నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిన ముంబై ఇండియన్స్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 10 మ్యాచ్‌ల్లో 7 గెలవాలి. కానీ ముంబై మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. బుమ్రా, తిలక్ వర్మ ఫామ్ కోల్పోగా.. ఇతర ఆటగాళ్లు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయలేకపోతున్నారు. గొప్పగా ఆడుతున్న రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఎలా రాణిస్తుందో అనే అందోళన అభిమానుల్లో నెలకొంది.

Story first published: Monday, April 13, 2026, 16:37 [IST]
Other articles published on Apr 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+