వైభవ్ సూర్యవంశీని అలా గాలికి వదిలేసాం: రియాన్ పరాగ్
టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ఎలాంటి సూచనలు చేయమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. అతనికి నచ్చిన రీతిలో ఆడేలా పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు.
బ్యాటింగ్‌లో మెరుగవ్వాలి..
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రియాన్ పరాగ్.. బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. 'ఇదొక అద్భుతమైన మ్యాచ్. నేను ప్రతి విషయంలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండటానికి ఇష్టపడతాను. మ్యాచ్ మొత్తం పర్‌ఫెక్ట్‌గా సాగడం సాధ్యం కాదని నాకు తెలుసు. అయినప్పటికీ మేం 260 పరుగులు చేసి ఉండాల్సింది. బ్యాటింగ్ విషయంలో మేం కొంచెం మెరుగవ్వాల్సి ఉంది.

ముఖ్యంగా వైభవ్ ఇచ్చిన అద్భుతమైన ఆరంభం తర్వాత ఇన్నింగ్స్‌ను ఎలా ముగించాలనే దానిపై వర్క్ చేయాలి. కానీ బౌలింగ్ విషయానికి వస్తే.. నేను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. మేం ఎంతో ప్రశాంతంగా ఒత్తిడిని తట్టుకున్నాం. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ కొన్ని బౌండరీలు బాదడంతో వారు తొలి రెండో ఓవర్లలో చాలా పరుగులు చేశారు. కానీ ఆ తర్వాత మేం చాలా బాగా పుంజుకున్నాం. మొత్తంగా ఇదొక మంచి ప్రదర్శన.
గాలికి వదిలేసాం..
మేం వైభవ్‌కు ఎలాంటి సూచనలు ఇవ్వం. స్వేచ్ఛగా ఆడేలా అతన్ని వదిలేసాం. ఆటను ఆస్వాదించే పూర్తి స్వేచ్ఛనిచ్చాం. నేను గతంలో చెప్పినట్లు అతనికి బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే నెట్స్‌లో అతనికి ఎక్కువ బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించేలా చూస్తాం. ఆ తర్వాత అతను మైదానంలోకి వెళ్లి తన పని తాను చేసుకుపోతాడు.
నాకౌట్ తరహా పరిస్థితులు ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీస్తాయి. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే ఈ టోర్నీలో మా ప్రయాణం ముగుస్తుందనే భయంతో ఆడలేదు. మా
కుర్రాళ్లు ఈ సీజన్ మొత్తం ఫియర్‌లెస్ గేమ్ ఆడారు. గత రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ప్రతీ ఒక్కరూ మరింత బాధ్యత తీసుకొని ఆడారు.
మా మధ్య ఆటపట్టింపులు ఉంటాయి..
జోఫ్రా ఆర్చర్, నా మధ్య సరదా ఆటపట్టింపులు సాగుతుంటాయి. అభిషేక్‌కు అతను వేసిన తొలి బంతికి నాకు దాదాపు క్యాచ్ వచ్చే అవకాశం వచ్చింది. కానీ అది వైడ్‌గా వెళ్ళింది. అప్పుడు నేను జోఫ్రా దగ్గరికి వెళ్లి.. 'జోఫ్, నువ్వు బంతిని కొంచెం స్ట్రెయిట్ (లైన్)లో వేయాలి' అని చెప్పాను. ఆ తర్వాత అతను వికెట్ తీసి, నవ్వుతూ నా దగ్గరికి వచ్చి.. 'ఇప్పుడు సరిపోతుందా.. ఇంతకంటే స్ట్రెయిట్‌గా వేయాలా?' అని అడిగాడు.
నా దృష్టిలో అతను ప్రపంచ క్రికెట్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. అతను 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నప్పుడు.. అతన్ని స్లోగా వేయమని గానీ, ఇంకేదో చేయమని గానీ మీరు చెప్పలేరు. ఒకవేళ అతనికి ఏమైనా గుర్తుచేయాల్సి వస్తే తప్ప మేం ఏమీ చెప్పం, మిగతా సమయంలో అతను తన పనిని చక్కగా పూర్తి చేస్తాడు.
గుజరాత్ పనిపడుతాం..
క్వాలిఫయర్-2 ముందుకు లభించిన రోజును పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాం. తాజా మ్యాచ్‌లో మాకు అందరికి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే బౌలింగ్ చేసే అవకాశం కూడా దక్కింది. కాబట్టి రేపు విశ్రాంతి తీసుకుని రికవర్ అవుతాం. నేను మాత్రం ఖచ్చితంగా రికవర్ అవుతాను. ప్రాక్టీస్ చేయను. అది పూర్తయ్యాక, నెక్స్ట్ మా టార్గెట్ గుజరాత్ టైటాన్స్'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications