రిస్క్ లేనిదే రివార్డ్ రాదు.. ఆ నిర్ణయమే గెలిపించింది: రియాన్ పరాగ్
జోఫ్రా ఆర్చర్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించడం, బౌలింగ్‌లో అతని కోటాను ముందుగానే పూర్తి చేయడం వంటి రిస్కీ నిర్ణయాలు తమను గెలిపించాయని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. మైదానంలో తన అంతరాత్మ ప్రకారమే నడుచుకుంటానని, తన కెప్టెన్సీ శైలినే ఇలా ఉంటుందని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. తాము ఎప్పుడో ప్లే ఆఫ్స్ చేరాల్సిందని, కానీ అనవసర తప్పిదాలతో ఆసల్యం చేశామని తెలిపాడు.
చాలా సంతోషంగా ఉంది..
'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే మా ప్రణాళికలు అనుకున్నట్లుగా సాగాయి. మేం ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ మేం ఇంకా మెరుగవ్వాల్సి విషయాలు చాలా ఉన్నాయి. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ మరికొంత సమయం ఆడాలి. దూకుడుగా ఆడే బ్యాటర్ అవసరమవ్వడంతోనే జోఫ్రా ఆర్చర్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాం. ఇలాంటి పిచ్‌పై ఇద్దరు ఆటగాళ్లు క్రీజులో ఉంటూ.. బంతికి ఒక పరుగు చొప్పున ఆడితే కుదరదు.

అందుకే ఒకరు చొరవ తీసుకుని, మరొకరు రిస్క్ చేయాలని అనుకున్నాము. తద్వారా మరొకరు క్రీజులో ఎక్కువసేపు నిలబడటానికి వీలవుతుంది. ఈ బాధ్యతలను జోఫ్రా ఆర్చర్‌కు అప్పగించగా సమర్ధవంతంగా నిర్వర్తించాడు. జడేజా భాయ్ ఎప్పటిలాగే ఎంతో నమ్మకమైన ఆటగాడు. చివరి ఓవర్లలో ఆయన కనీసం 10 బంతుల్లో 20 పరుగులు చేయగలని మాకు తెలుసు. అతను అదే చేశాడు.
నేనింతే..
ఈ సీజన్‌లో నేను చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. నా కెప్టెన్సీ శైలే ఇంత. నేను అస్సాం జట్టును కూడా ఇదే విధంగా నడిపిస్తాను. నేను తీసుకున్న నిర్ణయాలు ఏ మాత్రం జూదం కాదు. హార్దిక్ పాండ్యను ఔట్ చేయగల ఏకైక ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మాత్రమే అని నేను భావించాను.. ఆ వ్యూహం ఈ రోజు బాగా పనిచేసింది. నా అంతరాత్మ ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను.
మా యువ బౌలర్లు బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సాధారణంగా వీళ్లను నేను ఎక్కువగా పొగడను. ఎందుకంటే ఆ మాటలను వారు తలకెక్కించుకుంటారు. కానీ ఈ మ్యాచ్‌లో వారి ప్రదర్శనను కొనియాడాల్సిందే. బ్రిజేష్ గత కొన్ని మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లలో కొంచెం ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ, ఈ రోజు బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. అలాగే పుంజా.. ఒక నెట్ బౌలర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ప్రధాన స్పిన్నర్‌గా ఎదిగిన తీరు ప్రశంసనీయం. వారు ఇదే ప్రదర్శనను ప్లేఆఫ్స్‌లో కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
నేను ఫిట్‌గా లేను..
నిజం చెప్పాలంటే నేను ఫిట్‌గా లేను. కేవలం మానసిక దృఢత్వంతోనే ఈ మ్యాచ్ ఆడాను. ప్లే ఆఫ్స్ కూడా ఆడుతాను. జోఫ్రా ఆర్చర్ బాగానే ఉన్నాడు. అతను బండరాయిలా దృఢమైనవాడు. జడేజా భాయ్‌కి అక్కడక్కడా చిన్న చిన్న నొప్పులు ఉన్నాయి. కానీ అతడి దగ్గర కత్తి ఉంది. అతడొక యోధుడు.. ఖచ్చితంగా తిరిగి బలంగా వస్తాడు.
నిజానికి మేం చాలా ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాల్సింది. కానీ కాస్త ఆలస్యం చేశాం. ఎన్నో అవకాశాలను వదిలేశాం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెమ్మదించిన తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాం. మా తప్పులన్నింటి సరిదిద్దుకొని ప్లేఆఫ్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

