అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టునే విజయం వరిస్తుందని చెప్పాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. గత ఎలిమినేటర్ మ్యాచ్ తరహాలోనే ఈ పిచ్ ఉంది. కాకపోతే ఇన్నింగ్స్ చివర్లో పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకు తగ్గట్లు స్లోయర్ బాల్స్ వేసే బౌలర్లు మా దగ్గర ఉన్నారు. పిచ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. గత మూడు మ్యాచ్‌లను నాకౌట్ తరహాలోనే ఆడాం. మాకు మంచి మూమెంటమ్ లభించింది. ఏదో బలమైన కారణంతోనే మేం ఈ మూడు మ్యాచ్‌లు గెలిచాం.

ఇక్కడ ప్రతి ఒక్కరూ మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ గెలవాలనే కసితో ఉన్నారు. మా టీమ్ మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది. మేం 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడాలి. ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టు గెలుస్తుంది. మా ఆటగాళ్ల ఫిట్‌నెస్ నాజూగ్గానే ఉంది. నా పరిస్థితి కూడా అంతే. సన్నని నూలుపోగుపై ఆధారపడి ఉంది. ఆటగాళ్ల రికవరీ, గాయాల విషయంలో మా సపోర్ట్ స్టాఫ్ అద్భుతంగా పనిచేశారు. మేం సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఈ వికెట్‌పై ఇప్పటికే 40 ఓవర్ల ఆట పూర్తయింది. కాబట్టి ఇది పెద్దగా మారబోదని మేం భావిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ.. రియాన్ పరాగ్ చేసిన కాల్‌ను మ్యాచ్ రెఫరీ సరిగ్గా వినలేదని నేను అనుకుంటున్నాను
ఈ మ్యాచ్‌లో గెలవడం మాకు అత్యంత ముఖ్యం. ఇది మాకు డూఆర్ డై పరిస్థితి. మా జట్టులోని ప్రతీ ఒక్కరూ పూర్తి జోష్‌లో ఉన్నారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. సాయి కిషోర్ బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications