SRH చేతిలో ఓటమి మాకు ఓ గుణపాఠం: రియాన్ పరాగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చేతిలో ఎదురైన పరాజయం తమకు ఓ గుణపాఠం లాంటిదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ మ్యాచ్‌లోను తప్పిదాలను పునరావృతం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు.
పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. వికెట్ చాలా పొడిగా కనిపిస్తోంది. నిన్నే ఇక్కడ గడ్డిని కత్తిరించారు. కాబట్టి మొదటి ఇన్నింగ్స్‌లో కొంత టర్న్ ఉంటుందని ఆశిస్తున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఆ ఓటమి మాకు ఓ పాఠం..
గత ఏడాది ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మేం తృటిలో విజయాన్ని కోల్పోయాం. అయితే ఆ సమయంలో వరుణ్, నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మా పతనాన్ని శాసించారు. ఈసారి మా దగ్గర కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. భారీ లక్ష్యాన్ని నమోదు చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.
మేం గెలిచినా ఓడినా మా వ్యూహాలు మారవు. మా చర్చలు కూడా అలాగే ఉంటాయి. మేం ఎల్లప్పుడూ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. ఏది బాగా చేశాం.. ఇంకా ఏది మెరుగ్గా చేయవచ్చు అనే విషయాలనే చర్చిస్తాం. గత మ్యాచ్ మాకు ఒక గుణ పాఠం లాంటిది. ఈ మ్యాచ్‌లో ఆ తప్పులను పునరావృతం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. లువాన్ స్థానంలో హెట్‌మైర్ రీఎంట్రీ ఇచ్చాడు. తుషార్‌కు విశ్రాంతినిచ్చి బ్రిజేష్‌ను ఆడిస్తున్నాం.'అని రియాన్ పరాగ్ తెలిపాడు.
బ్యాటింగ్ చేయాలనుకున్నాం..
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. 'గతంలో చెప్పినట్లుగానే మా బ్యాటర్లు స్వేచ్చగా ఆడాలి. ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోకుండా బ్యాటర్లు నిర్బయంగా ఆడాలని మేం కోరుకుంటున్నాం. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్ యూనిట్ చెలరేగితే విజయాలు దక్కుతాయి. గత మూడు మ్యాచ్‌ల్లో మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అందుకే ఈ మ్యాచ్‌లో మేం ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం.
కానీ టాస్ ఓడిపోయినందుకు కూడా సంతోషంగానే ఉంది. గతం గతమే అని, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని మేం నమ్ముతాము. ప్రస్తుతం మా చేతుల్లో ఉన్నది ఈ క్షణం మాత్రమే. కాబట్టి మా శాయశక్తులా ప్రయత్నిస్తూ, స్వేచ్ఛగా ఆడుతూ, మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడమే ముఖ్యం. కొన్నిసార్లు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు, మనం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ మా కుర్రాళ్ల సన్నద్ధత అద్భుతంగా ఉంది. వారంతా మంచి మానసిక స్థితిలో ఉన్నారు. ఫలితాలు ఎలాగైనా రావచ్చు. కాబట్టి ఈ క్షణంలో ఉంటూ స్వేచ్ఛగా ఆడటమే ముఖ్యం. సేమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ :
అజింక్య రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), కామరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి.
రాజస్థాన్ రాయల్స్:
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డొనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications