అది గ్యాంబ్లింగ్ కాదు.. ప్లే ఆఫ్స్ చేరే అర్హత మాకు లేదు: రియాన్ పరాగ్
డోనవన్ ఫెరీరాతో బౌలింగ్ చేయించడం గ్యాంబ్లింగ్ కాదని తన నిర్ణయాన్ని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సమర్థించుకున్నాడు. టీవీల్లో చూసేవారికి అది ఒక ప్రయోగంలా అనిపిస్తుందని చెప్పాడు. తమ ఓటమికి అతను ఏ మాత్రం కారణం కాదని, బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచిందన్నాడు. తాము 210 పరుగులు చేయాల్సిందని, కానీ 20 పరుగులు తక్కువగా చేశామని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో ఫెరీరా 18వ ఓవర్ బౌలింగ్ చేసి 16 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో మూమెంటమ్ ఢిల్లీవైపు మళ్లింది.
అది గ్యాంబ్లింగ్ కాదు..
ఈ మ్యాచ్ అనంతరం ఫెరీరాతో బౌలింగ్ చేయించడంపై హోస్ట్ ప్రశ్నించగా.. రియాన్ పరాగ్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. గత 4-5 మ్యాచ్‌ల్లో తమ జట్టు ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదని, ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ చేరే అర్హత తమకు ఉండదని చెప్పాడు. '14 ఓవర్లు ముగిసేసరికి మేం చాలా మంచి స్థితిలో ఉన్నాం. కానీ నేను ఔట్ అయిన తర్వాత మేం ఆ మూమెంటమ్‌ను కొనసాగించలేకపోయాం. నిజానికి మేం 210 పరుగులు చేయాల్సింది.
ఇక మా బౌలింగ్ విషయానికొస్తే.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఫెరీరాతో బౌలింగ్ చేయించడం అనేది గ్యాంబ్లింగ్ ఏం కాదు. టీవీల్లో చూసేవారికి అది ఒక ప్రయోగంలా అనిపించవచ్చు. టైటిల్ గెలవాలంటే ప్రతీ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పోరాడాలి.

మాకు అర్హత లేదు..
గత 4-5 మ్యాచ్‌ల్లో మేం మా జట్టుకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాం. సుదీర్ఘ విరామం తర్వాత ఆడటం వల్ల కావచ్చు.. నైపుణ్యాల పరంగా, ఉత్సాహం, ప్రణాళికల అమలు పరంగా మేం సరిగ్గా రాణించలేకపోయాం. ఒకవేళ మేం ఇలాగే ఆడితే.. టాప్-4 (ప్లేఆఫ్స్)లో ఉండే అర్హత మాకు లేదు. మాకు మంచి అవకాశం వచ్చింది. కానీ మేం దాన్ని చేజార్చుకున్నాము. మేం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే, అది పూర్తిగా మా తప్పే అవుతుంది. ఈ విషయంలో ఎవర్నీ నిందించలేం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
గెలిపించిన అషుతోష్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), కెప్టెన్ రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. వైభవ్ సూర్యవంశీ(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(4/40) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, మాధవ్ తివారి రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(42 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 56), అభిషేక్ పోరెల్(31 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), అషుతోష్ శర్మ(5 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. డసన్ షనక ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications