IPL 2026: రాకాసి బౌన్సర్‌తో.. రిషభ్ పంత్ చేయి విరగ్గొట్టిన హాజెల్‌వుడ్!
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ మోచేతికి బంతి బలంగా తాకింది. ఆర్‌సీబీ స్టార్ పేసర్ హాజెల్ వుడ్ వేసిన షార్ట్ పిచ్ బాల్ ఆడబోయిన పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతి నేరుగా రిషభ్ పంత్ మోచేతికి బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిలలాడిన పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ సందర్భంగా ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రసిక్ సలామ్ వేసిన నాలుగో ఓవర్ ఆఖరి బంతికి ఎయిడెన్ మార్క్‌రమ్ క్యాచ్ ఔట్ కావడంతో రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. జోష్ హాజెల్ వుడ్ తన బౌన్సర్లతో రిషభ్ పంత్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ ఓవర్ నాలుగో బంతి పంత్‌క గాయపడి మైదానం వీడాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్‌ను హాజెల్ వుడ్ ఓదార్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నిప్పులు చెరిగిన హాజెల్ వుడ్..
రిషభ్ పంత్ వెనుదిరిగడంతో నికోలస్ పూరన్ క్రీజులోకి రాగా.. అతని తన మరుసటి ఓవర్‌లో హాజెల్ వుడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మిచెల్ మార్ష్‌ను కూడా హాజెల్ వుడ్ తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. హాజెల్ వుడ్ వేసిన ఓ బంతి మిచెల్ మార్ష్ నడుముకు బలంగా తాకింది. మొత్తం 4 ఓవర్లు వేసిన హాజెల్ వుడ్ 20 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసాడు.

కట్టుతో బరిలోకి దిగినా..
లక్నో బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో చేతికి కట్టు కట్టుకొని పంత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంతి పడుతుండగా.. తాజాగా పంత్ ఈ జాబితాలో చేరాడు. రిషభ్ పంత్ గాయం తీవ్రత ఎక్కువైతే లక్నో సూపర్ జెయింట్స్‌కు మరిన్ని కష్టాలు తప్పవు.
కుప్పకూలిన లక్నో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. రసిక్ సలామ్‌తో పాటు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(3/27) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.
లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్ బదోని(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), ముకుల్ చౌదరి(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications