లక్నో కెప్టెన్సీకి రిషభ్ పంత్ గుడ్‌బై!
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకి రిషభ్ పంత్ గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర పరాభావం నేపథ్యంలో సారథ్య బాధ్యతల నుంచి పంత్ స్వయంగా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
'కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని రిషభ్ పంత్ చేసిన అభ్యర్థనను ఫ్రాంచైజీ మర్యాదపూర్వకంగా అంగీకరించింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఇప్పటి వరకు ఫ్రాంచైజీకి గొప్పగా సేవలందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టును అత్యుత్తమ ప్రమాణాలతో పునర్నించడంపై మా మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టింది.'అని లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్ టూమ్ మూడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గానూ రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 6 విజయాలే సాధించి ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారిపట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications