గతేడాది గాయాలు ఇబ్బంది పెట్టాయి.. ఈ సారి చూపిస్తాం: రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది తాజా వికెట్. రెడ్ సాయిల్ పిచ్ కావడంతో ఫాస్ట్ బౌలర్లకు ఏమైనా సహకరిస్తుందో లేదో చూడాలి. గణాంకాల ప్రకారం ఛేజింగ్ చేసే జట్లే ఇక్కడ గెలిచాయి. కానీ ఇది కొత్త టోర్నీ కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడమే మంచిదని నేను భావిస్తున్నాను. గతేడాది మేం బాగానే ఆరంభించినప్పటికీ.. మధ్యలో పట్టు కోల్పోయాం. ఈసారి మళ్ళీ మంచి ఆరంభాన్ని కోరుకుంటున్నాం. మా విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో ముగ్గురు బ్యాటర్లు మిల్లర్, నిస్సాంక, స్టబ్స్, ఒక బౌలర్‌గా లుంగి ఎన్గిడిని తీసుకున్నాం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ ఓడినా తమకు ఎలాంటి ఫరక్ పడదని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఇక్కడి పిచ్ ఏ మాత్రం మారదని, టాస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని చెప్పాడు. 'ఈ పిచ్ ఏ మాత్రం మారదు. టాస్ గెలిచినా .. ఓడినా ఒక్కటే. సరికొత్త శక్తి, కొత్త లోగో, రంగు, కొత్త ఆలోచనా విధానంతో ఈ సీజన్ బరిలోకి దిగుతున్నాం.
ఈ టోర్నీ కోసం మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. గతేడాది గాయాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బౌలర్లు అందరూ ఫిట్‌గా ఉన్నారు. ప్రతీ ఒక్కరూ మ్యాచ్‌పై ప్రభావం చూపడానికి సిద్దంగా ఉన్నారు. మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, అన్రిచ్ నోకియాలను ఓవర్‌సీస్ ప్లేయర్లుగా బరిలోకి దించుతున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
లక్నో సూపర్ జెయింట్స్:
ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్.
ఢిల్లీ క్యాపిటల్స్:
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముఖేష్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications