క్లారిటీ లేకుంటే టాప్ ప్లేయర్స్ ఉన్నా వేస్టే: రిషభ్ పంత్
క్లారిటీ లేకుండా క్రికెట్‌లో రాణించడం కష్టమని లక్నో సూపర్ జెయింట్స్(LSG) కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. స్పష్టత లేనప్పుడు జట్టులో ఎంత పెద్ద ప్లేయర్లు ఉన్నా వృథానేనని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.
టాస్ సందర్భంగా మాట్లాడిన రిషభ్ పంత్.. తమ జట్టును గాయాల బెడద వేధిస్తోందని తెలిపాడు. దాంతో తుది జట్టులో పలు మార్పులు చేశామని వెల్లడించాడు. 'మా జట్టులో కొందరు ఆటగాళ్లకు గాయాలయ్యాయి. అందుకే ఇంగ్లిస్ స్థానంలో అర్షిన్ కుల్కర్ణి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లిస్‌కు స్వల్ప గాయమైంది. మోహ్సిన్‌కు కూడా చిన్న గాయమైంది. దాంతో మణిమారన్ సిద్ధార్థ్ స్థానంలో షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగాడు.

క్లారిటీ ముఖ్యం..
మేం మరింత క్లారిటీతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమంతా అగ్రశ్రేణి ఆటగాళ్లమని మాకు తెలుసు. కానీ కొన్నిసార్లు క్రికెట్‌లో స్పష్టత లోపించినప్పుడు ఇలా పరాజయాలు ఎదురవుతుంటాయి. కాబట్టి చాలా వరకు మేం స్పష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. కాబట్టి వీటిని పరిష్కరించి వచ్చే సీజన్ నాటికి సిద్ధమవుతామని ఆశిస్తున్నాం.
ప్రయోగాలు చేయడంలో తప్పు లేదు..
టీ20 క్రికెట్‌లో స్థిరమైన వాతావరణం ఉండటం చాలా అవసరం. కానీ అదే సమయంలో మార్పులు అవసరమైనప్పుడు ఆ మార్పులు చేయగలగాలి. ఎందుకంటే ప్రతిసారీ ఒకే పని చేయడం వల్ల ఒకే రకమైన ఫలితం రాకపోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు కొత్తగా ప్రయత్నించాలి. ముఖ్యంగా ప్రస్తుతం మేం ఉన్న స్థితిలో ప్రయోగాలు చేయడం తప్పేం కాదు. ఇది 180-190 స్కోరు వచ్చే వికెట్‌లా కనిపిస్తోంది. గతంలో జరిగిన చాలా మ్యాచ్‌ల కంటే ఇది మెరుగైన వికెట్.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ఇది స్లో పిచ్..
మరోవైపు టాస్ గెలిచిన రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 'చిన్నస్వామి స్టేడియం తరహాలో ప్రేక్షకుల గోల లేకపోయినా.. ఇప్పటికీ సందడిగానే ఉంది. ఇది గట్టి ఉపరితలం అని నేను భావిస్తున్నా. ఇది నల్ల రేగడి నేల పిచ్. పైగా ఇక్కడ గత 4-5 మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. మేం ప్రత్యర్థిని వీలైనంత తక్కువ స్కోరుకు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాం.
గత మ్యాచ్ తర్వాత మాకు సుదీర్ఘ విరామం లభించింది. అందరూ మంచి మానసిక స్థితిలో కనిపిస్తున్నారు. ఆరు ఏడు రోజుల కష్టపడి చేసిన శిక్షణ తర్వాత మేం మళ్లీ కలిశాం. నేను చెప్పినట్లుగా.. టోర్నీ ఆసాంతం అందరూ బాగా రాణిస్తున్నారు. మేం ఈ గేమ్ కోసం ఎదురుచూస్తున్నాం. మేం పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications