Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కొంపముంచిన బర్గర్.. కేకేఆర్‌ను గెలిపించిన రింకూ సింగ్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఐదు పరాజయాల తర్వాత విజయం సాధించింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో హోరాహోరీగా సాగిన లోస్కోర్ గేమ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ, కార్తీక్ త్యాగీ తీన్మార్ బౌలింగ్‌తో సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో రింకూ సింగ్ అజేయ హాఫ్ సెంచరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

రింకూ సింగ్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల‌కు 155 పరుగులే చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వి జైస్వాల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగీ(3/22), వరుణ్ చక్రవర్తీ(3/14) మూడేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.

IPL 2026 Rinku Singh Vintage Finishing Act Secures KKR s First Win in Thriller Against RR

అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో 161 పరుగులు చేసి గెలుపొందింది. రింకూ సింగ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనుకుల్ రాయ్(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కామెరూన్ గ్రీన్(13 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27), రోవ్‌మన్ పోవెల్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా(2/8) రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్ యశ్ రాజ్ పుంజా తలో వికెట్ తీసారు.

గెలిపించిన రింకూ సింగ్..

156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ తీవ్రంగా తడబడింది. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. కానీ రింకూ సింగ్, అనుకూల్ రాయ్(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో కేకేఆర్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. చివరి 37 బంతుల్లోనే 76 పరుగులు చేశారు.

జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్‌లో అనుకుల్ రాయ్ భారీ సిక్సర్ బాది విజయ సమీకరణాన్ని సులువు చేశాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ వరుసగా రెండు బౌండరీలు బాది మ్యాచ్ టై చేశాడు. తర్వాతి బంతిని డాట్ చేసినా చివరి బంతి సిక్స్ బాది ఈ టోర్నీలో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

కొంపముంచిన బర్గర్..

8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రే బర్గర్ వదిలేసాడు. ఈ తప్పిదం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. రవీంద్ర జడేజా వేసిన 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని జడేజా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. రింకూ సింగ్ స్వీప్ షాట్ ఆడబోయాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బర్గర్.. ఈ సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ కోసం వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా పరుగెత్తడం బర్గర్‌ను డిస్టర్బ్ చేసింది. ఏది ఏమైనా ఈ క్యాచ్ డ్రాప్ రాజస్థాన్ రాయల్స్ ఓటమిని శాసించింది.

Story first published: Sunday, April 19, 2026, 19:40 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+