IPL 2026: పంజాబ్ కొంపముంచిన పాంటింగ్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా చతికలపడింది. తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. అనూహ్యంగా గత నాలుగు వరుస మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్, అనాలోచిత నిర్ణయాలతో మూల్యం చెల్లించుకుంది.
సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలోనూ ఓటమిపాలైంది. ఈ వరుస ఓటములతో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించకపోవడం.. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ సూర్యన్ష్ షెడ్గేను అప్‌ది ఆర్డర్ ఆడించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సూర్యన్ష్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో సూర్యన్ష్ షెడ్గే మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినీస్, శశాంక్ సింగ్(0) వరుస బంతుల్లో ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన షెడ్గే.. హ్యాట్రిక్ బాల్‌ను భారీ సిక్సర్‌గా తరలించాడు.
అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ స్కోర్ 187 నుంచి 210కి చేరింది. అతన్ని మరింత ముందుగా పంపించి ఉంటే పంజాబ్ అదనంగా మరో 20 పరుగులు చేసేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాంటింగ్ వ్యూహాత్మక తప్పిదం..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సూర్యన్ష్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు దూకుడైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో రికీ పాంటింగ్ నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా షెడ్జ్‌ను ఐదో స్థానంలో ఆడించకపోవడాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. పంజాబ్ టాప్-4 బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ.. మార్కస్ స్టోయినీస్, శశాంక్ సింగ్ ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నారు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓపెనర్లు, కానలీ (నం.3), శ్రేయాస్ (నం.4) రాణించినప్పటికీ, స్టోయినిస్, శశాంక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఈ ఇద్దరి కంటే ముందే సూర్యన్ష్ షెడ్గేను బ్యాటింగ్‌కు పంపిస్తే పంజాబ్ కింగ్స్ మళ్లీ విజయాల బాట పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌ల్లో షెడ్డేను అప్‌ది ఆర్డర్ ఆడిస్తేనే పంజాబ్ కింగ్స్‌కు ఆశించిన ఫలితం దక్కనుంది. ఐపీఎల్ 2018 నాటి పతనం పునరావృత్తం కాకుడదంటే.. పంజాబ్ తమ వ్యూహాలను సమీక్షించి, ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications