ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మినీ ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. మినీ వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియను ప్రారంభించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)..రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు నవంబర్ 15(శనివారం)న సాయంత్ర 5 గంటల వరకు డెడ్‌లైన్ విధించింది. దాంతో అధికార బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్ వేదికగా 10 ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితా శనివారం విడుదలైంది.
మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 8 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, మహమ్మద్ షమీ, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను వదిలేసింది. అయితే తమ కోర్ టీమ్‌ను మాత్రం ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది.

రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సిమర్జిత్ సింగ్ కాస్త మెరుగైన ప్రదర్శనే చేశాడు. కానీ అతన్ని కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయడం గమనార్హం. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో సన్‌రైజర్స్ రూ.25.5 కోట్ల భారీ ధరతో వేలంలోకి వెళ్లనుంది. జట్టుకు భారమైన ఆటగాళ్లనే సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకున్నట్లు అర్థమవుతుంది. హెన్రీచ్ క్లాసెన్‌ను వదిలేస్తుందని ప్రచారం జరిగినా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం అతన్ని అంటిపెట్టుకుంది. ఒక్క ప్లేయర్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ చేసుకోలేదు. వేలానికి ముందు అయినా ట్రేడ్‌కు ప్రయత్నిస్తుందో లేదో చూడాలి.
అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, మహమ్మద్ షమీ, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.
పర్స్ వాల్యూ: రూ.25.5 కోట్లు