Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కోహ్లీ ఫ్రెండ్‌పై వేటు.. ఆర్‌సీబీ రిటైన్, రిలీజ్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తమ రిటైన్, రిలీజ్ లిస్ట్‌ను ప్రకటించింది. కోర్ టీమ్‌ను కొనసాగించిన ఆర్‌సీబీ.. జట్టుకు భారంగా మారిన 8 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ అయిన స్వస్తిక్ చికరాపై వేటు పడింది. ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం స్వస్తిక్ చికరా కోహ్లీ చుట్టూనే తిరుగుతూ కనిపించాడు. కోహ్లీని కాక పడుతున్నాడని అప్పట్లో స్వస్తిక్ చికరాపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలాయి.

అతనితో పాటు ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్‌ను కూడా ఆర్‌సీబీ వదిలేసింది. అందరూ ఊహించినట్లుగానే బ్యాకప్ వికెట్ కీపర్ టీమ్ సీఫెర్ట్, స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌లను కూడా ఆర్‌సీబీ వదిలేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన లివింగ్ స్టోన్ తీవ్రంగా నిరాశపర్చాడు.

IPL 2026 Retention RCB Reveal Complete List of Released and Retained Players
Photo Credit: X (twitter)

మనోజ్ భాండగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజర్బాని, మోహిత్ రతీలను కూడా ఆర్‌సీబీ వదిలేసింది. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఆర్‌సీబీ రూ.16.4 కోట్ల పర్స్ మనీతో ఆర్‌సీబీ మినీ వేలంలోకి వెళ్తోంది. కోర్ టీమ్‌ను కొనసాగించిన ఆర్‌సీబీ వారికి అనుగుణంగా బలమైన బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేయనుంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.

ఆర్‌సీబీ రిలీజ్ లిస్ట్:

స్వస్తిక్ చికరా, మయాంక్ అగర్వాల్, టీమ్ సిఫెర్ట్, లియామ్ లివింగ్ స్టోన్, మనోజ్ భాండగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజర్బానీ, మోహిత్ రతీ

ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్:

రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ

మిగిలిన పర్స్ విలువ: రూ.16.4 కోట్లు

Story first published: Saturday, November 15, 2025, 18:38 [IST]
Other articles published on Nov 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+