For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: మ్యాచ్ విన్నర్‌పై వేటు.. ముంబై ఇండియన్స్ రిటెన్షన్, రిలీజ్ జాబితా ఇదే

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. అధికార ప్రకటన రాకపోయినా ఆ దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. మినీ వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియను ప్రారంభించిన బీసీసీఐ..రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు నవంబర్ 15(శనివారం)న సాయంత్ర 5 గంటల వరకు డెడ్‌లైన్ విధించింది. దాంతో అధికార బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్ 10 ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముందుగా అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు చెందిన రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది.

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం 9 మంది ఆటగాళ్లను వదిలేసింది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన ఆటగాళ్లతో పాటు గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లను రిలీజ్ చేసింది. తెలుగు తేజం సత్య నారయణ రాజుతో పాటు రీస్ టాప్లీ, కేఎల్ శ్రీజిత్, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్, బెవాన్ జేకబ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూర్‌ను వదిలేసింది.

ఇందులో విఘ్నేష్ పుత్తూర్‌‌‌ను వదిలేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత సీజన్‌లో విఘ్నేష్ పుత్తూర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. వేలానికి ముందే ముంబై ఇండియన్స్ షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్‌(రూ.2.6 కోట్లు)ను గుజరాత్ టైటాన్స్ నుంచి, శార్దూల్ ఠాకూర్‌(రూ.2 కోట్ల)ను లక్నో సూపర్ జెయింట్స్‌ నుంచి ముంబై ట్రేడ్ చేసుకుంది.

IPL 2026 Retention Mumbai Indians Full List of Released Traded amp amp Retained Players

ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్ట్:

సత్య నారయణ రాజు(రూ.30 లక్షలు), రీస్ టాప్లీ(రూ.75 లక్షలు), కేఎల్ శ్రీజిత్( రూ.30 లక్షలు), కర్ణ్ శర్మ( రూ.50 లక్షలు), అర్జున్ టెండూల్కర్( రూ.30 లక్షలు), బెవాన్ జేకబ్స్( రూ.30 లక్షలు), ముజీబ్ ఉర్ రెహ్మాన్( రూ.2 కోట్లు), లిజాడ్ విలియమ్స్( రూ.75 లక్షలు), విఘ్నేష్ పుత్తూర్‌ ( రూ.30 లక్షలు)

ట్రేడింగ్ ప్లేయర్స్: షెర్ఫేన్ రూథర్‌పోర్డ్(రూ.2.6 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ.2 కోట్లు)

ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్:

హార్దిక్ పాండ్యా(రూ. 18 కోట్లు), రోహిత్ శర్మ(రూ.16.30 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు), నమన్ ధీర్(రూ. 5.25 కోట్లు), ట్రెంట్ బౌల్ట్(రూ. 12.50 కోట్లు), ర్యాన్ రికెల్టన్(రూ. కోటి), దీపక్ చాహర్(రూ. 9.25 కోట్లు), విల్ జాక్స్(రూ. 5.25 కోట్లు), అశ్వని కుమార్(రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్(రూ. 2 కోట్లు), రాజ్ బవా(రూ. 30 లక్షలు), దీపక్ చాహర్(రూ.9.25 కోట్లు), రాబిన్ మింజ్(రూ.65 లక్షలు).

Story first published: Saturday, November 15, 2025, 17:29 [IST]
Other articles published on Nov 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+