Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 Retention List విడుదల.. ఎప్పుడు? ఎలా చూడాలంటే..?

ఐపీఎల్ 2026 మినీ వేలం నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు ముమ్మరం చేసింది. డిసెంబర్ 14న అబుదాబి వేదికగా ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించేందుకు శనివారం(నవంబర్ 15) డెడ్‌లైన్ విధించింది.

మినీ వేలం కాబట్టి ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవు. ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. నచ్చని ఆటగాళ్లను వదిలేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితం లేదు. ఈ రిటెన్షన్ ప్రక్రియను ప్రకటించేలోపే ఆయా జట్లు తమ క్యాష్ ట్రేడింగ్ డీల్స్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మినీ వేలం ముగిసే వరకు ట్రేడింగ్ విండో ముగిసిపోతుంది. ఆ తర్వాత మళ్లీ ప్లేయర్ ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమ ట్రేడింగ్ డీల్స్‌ను ప్రకటిస్తున్నాయి.

IPL 2026 Retention Guide Full Details on Teams Rules and Player Decisions

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలను శనివారం సాయంత్ర 5 గంటలకు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ వేదికగా ప్రకటించనున్నారు. 10 జట్ల రిటెన్షన్ లిస్ట్‌తో పాటు, రిలీజ్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించనున్నారు. ఈ రెండు వేదికల్లో చూడాలంటి డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్ ద్వారా జియో హాట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఐపీఎల్ 2025 విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మినహా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.

Story first published: Friday, November 14, 2025, 17:38 [IST]
Other articles published on Nov 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+