IPL 2026: కీలక ఆటగాళ్లపై వేటు.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్, రిలీజ్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తమ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. మినీ వేలానికి ముందు ఏకంగా 10 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకుంది. అతని కోసం రవీంద్ర జడేజా, సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కీలక ఆటగాళ్లను కూడా సీఎస్‌కే వదులుకుంది.
రచిన్ రవీంద్ర, మతీష పతీరణతో పాటు దీపక్ హుడా, విజయ్ శంకర్, తెలుగు తేజం షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి, రాహుల్ త్రిపాఠి, వాన్ష్ బేడీ, ఆండ్రీ సిద్దార్థ్‌లను వదిలేసింది. దాంతో సీఎస్‌కే పర్స్ వాల్యూలో రూ. 43.4 కోట్ల భారీ క్యాష్ మిగిలింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సీఎస్‌కే రిటైన్ చేసుకోవడంతో రిటైర్మెంట్ వార్తలకు తెరపడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోనీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. డెవాన్ కాన్వేను వదిలేస్తుందని ప్రచారం జరిగినా.. అది అవాస్తవమని తేలింది. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినా.. రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తాడని సీఎస్‌కే ప్రకటించింది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా మినీవేలం జరగనుంది.

సీఎస్‌కే రిలీజ్ లిస్ట్:
రాహుల్ త్రిపాఠి, వాన్ష్ బేడీ, ఆండ్రూ సిద్దార్థ్, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి, మతీష పతీరణ.
సీఎస్‌కే రిటైన్ లిస్ట్:
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), డేవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
పర్స్ వాల్యూ: రూ. 43.4 కోట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications