RCB vs LSG: నిప్పులు చెరిగిన రూ.6 కోట్ల ఆటగాడు..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అనామక పేసర్ రసిక్ దార్ సలామ్ నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఆర్‌సీబీ యువ పేసర్ (4/24) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అతని ధాటికి ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
రసిక్ సలామ్‌తో పాటు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(3/27) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్ బదోని(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), ముకుల్ చౌదరి(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

పిచ్ స్లోగా ఉండటంతో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అనామక పేసర్ అయిన రసిక్ సలామ్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డేంజరస్ ఎయిడెన్ మార్క్‌రమ్(12)ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిక్ సలామ్.. క్రీజులో సెట్ అయిన ఆయుష్ బదోనితో పాటు ముకుల్ చౌదరిని పెవిలియన్ చేర్చాడు.
ముకుల్ చౌదరితో పాటు ఆవేశ్ ఖాన్(1)లను స్టన్నింగ్ యార్క్‌ర్లతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ జమ్మూకశ్మీర్ పేసర్‌ను ఆర్‌సీబీ రూ.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ గత సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడింది కూడా రెండు మ్యాచ్‌లే. ముంబై ఇండియన్స్‌తో గత మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన రసిక్ సలామ్.. తాజా మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ గొప్ప ఆస్థిగా మారాడు. తన సంచలన బౌలింగ్‌తో యశ్ దయాల్ లేని లోటును తీర్చుతున్నాడు.
2019లోనే ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన రసిక్ సలామ్.. పర్వేజ్ రసూల్ తర్వాత ఐపీఎల్‌కు ఎంపికైన రెండో జమ్మూ కాశ్మీర్ ఆటగాడిగా రికార్డు సాధించాడు. కానీ వయసు నిబంధన కారణంగా రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి మళ్లీ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమైన అతను ఈ సీజన్‌లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications