Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: బీభత్సంగా ఆర్‌సీబీ.. తుది జట్టు అంచనా ఇదే!

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచింది. గతంలో మూడు సార్లు(2009, 2011, 2016) చేజారిన కప్‌ను ఈసారి ఒడిసిపట్టుకున్న ఆర్‌సీబీ.. తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. ఈ విజయంతో కోహ్లీ కెరీర్‌లో లోటుగా ఉన్న ఐపీఎల్ టైటిల్ కూడా వచ్చి చేరింది. ఈ గెలుపు స్ఫూర్తితోనే అప్‌కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో విజేతగా నిలవాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది.

ఐపీఎల్ 2026 మినీ వేలం నుంచే ఆ దిశగా అడుగులు వేసింది. కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టు బొక్కలను పూడ్చుకుంది. ముఖ్యంగా జట్టుకు భారంగా మారిన లివింగ్ స్టోన్‌ను వదిలేసి భారత పేస్ ఆల్‌రౌండర్ అయిన వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. బ్యాకప్ బెంచ్ కోసం లెఫ్టార్మ్ పేస్ ఆల్‌రౌండర్ మంగేష్ యాదవ్‌ను రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. జాకబ్ డఫీ (రూ. 2 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ. 30 లక్షలు), జోర్డాన్ కాక్స్ (రూ. 75 లక్షలు), విక్కీ ఓస్ట్వాల్ (రూ. 30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ. 30 లక్షలు), కనిష్క్ చౌహాన్ (రూ. 30 లక్షలు) ఆటగాళ్లను తీసుకుంది.

IPL 2026 RCB s Probable Playing XI as Defending Champions Eye Back-to-Back Glory

బీభత్సంగా బ్యాటింగ్ లైనప్

ఐపీఎల్ 2026 మినీ వేలం తర్వాత ఆర్‌సీబీ సమతుల్యంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్‌లతో టాప్ ఆర్డర్ బీభత్సంగా ఉంది. వెంకటేశ్ అయ్యర్‌ రాకతో జట్టు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ఆప్షన్ పెరిగింది. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి పవర్ హిట్టర్లు.. జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్లతో టీమ్ సమతూకంగా ఉంది. కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ, స్వప్నిల్ సింగ్‌లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. పేరున్న స్పిన్నర్ లేకపోవడం.. స్టార్ పేసర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకోవడమే జట్టు బలహీనతగా కనిపిస్తోంది.

ఆర్‌సీబీ కాంబినేషన్ ఏంటంటే..?

గత సీజన్ తరహాలోనే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. దేవదత్ పడిక్కల్‌ను ఇంపాక్ట్ సబ్‌గా బ్యాటింగ్ ఆడించనున్నారు. రజత్ పటీదార్, వెంకటేశ్ అయ్యర్, జితేశ్ శర్మ మిడిలార్డర్‌లో ఆడనుండగా.. టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్లు బరిలోకి దిగనున్నారు. జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. దేవదత్ పడిక్కల్ స్థానంలో సుయశ్ శర్మ ఇంపాక్ట్ సబ్‌గా ఆడుతాడు. ఎక్స్‌ట్రా పేస్ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే రొమారియో షెఫర్డ్ బరిలోకి దిగుతాడు. అప్పుడు దేవదత్ పడిక్కల్ బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది. ఫిల్ సాల్ట్ బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాడు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్.

సుయాశ్ శర్మ(ఇంపాక్ట్ సబ్)

ఆర్‌సీబీ పూర్తి జట్టు:

రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ, వెంకటేష్ అయ్యర్ , జాకబ్ డఫీ, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్ , జోర్డాన్ కాక్స్ , విక్కీ ఓస్ట్వాల్, విహాన్ మల్హోత్రా , కనిష్క్ చౌహాన్.

Story first published: Wednesday, December 31, 2025, 16:14 [IST]
Other articles published on Dec 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+