Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆర్‌సీబీ హెడ్ కోచ్‌‌కు జరిమానా.. ఎందుకుంటే?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) హెడ్ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

'ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 'లెవెల్ 1' నిబంధనను ఉల్లంఘించినట్లు తేలింది. ఆయన తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ ఈ జరిమానాను విధించారు. ఆండీ ఫ్లవర్ ఆర్టికల్ 2.3ని ఉల్లంఘించారు. మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన మ్యాచ్‌లోని 17.2 ఓవర్ సమయంలో జరిగింది. ఫోర్త్ అంపైర్‌తో ఆండీ ఫ్లవర్ వాగ్వాదానికి దిగారు.'అని పేర్కొన్నారు.

IPL 2026 RCB Coach Andy Flower Fined for Code of Conduct Breach Against Mumbai Indians
Photo Credit: IPL (X)

అసలేం జరిగింది అంటే..?

ఆర్‌‌సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో రెండో బంతిని కృనాల్ పాండ్యా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్‌పై ముంబై ప్లేయర్లు తిలక్ వర్మ, నమన్ ధీర్ సమన్వయ లోపంతో రిలే క్యాచ్‌ను పూర్తి చేయలేకపోయారు. సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్న నమన్ ధీర్.. సమన్వయం కోల్పోయి బౌండరీ లోపల ఉన్న తిలక్ వర్మకు అందజేశాడు. కానీ ఈ క్యాచ్‌ను అతను అందుకోలేదు. సిక్సర్‌గా వెళ్లిందని భావించిన కృనాల్ పాండ్యా పరుగులు తీయలేదు. దాంతో థర్డ్ అంపైర్ డాట్ బాల్‌గా ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆండీ ఫ్లవర్.. ఫొర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బౌండరీ ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. భువనేశ్వర్ కుమార్ సిక్సర్‌తో ఆర్‌సీబీ గెలిపించాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

Story first published: Monday, May 11, 2026, 13:08 [IST]
Other articles published on May 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+