IPL 2026: ముంబై అభిమానుల ముఖ చిత్రం ఏంటో!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా నిలిచింది.
అయితే ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి అత్యంత బద్ద శత్రువైన ఫ్రాంచైజీ ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే. భారత్, పాకిస్థాన్ తరహాలోనే ఆర్‌సీబీ-ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటారు. భారత ఐకాన్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరొక ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అభిమానులు రెండు వర్గాలు విడిపోయి ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ పేరిట గొడవపడుతుంటారు.

అభిమానులకు తగ్గట్లుగా కొందరు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఈ వైరాన్ని పెద్దది చేశారు. ముంబై, ఆర్‌సీబీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం ఉంది. ఒకరి విజయాన్ని మరొకరు జీర్ణించుకోలేని స్థాయికి ఇది చేరింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రెండేళ్ల క్రితం వరకు ఒక్క టైటిల్ లేదంటూ ఆర్‌సీబీని ఎగతాళి చేసేవారు. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్‌సీబీ ఛాంపియన్ టీమ్‌గా మారిపోగా.. ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమవుతుంది. తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.
మరోవైపు ఆర్‌సీబీ అద్వితీయమైన ప్రదర్శనతో రెండో టైటిల్ ఎగరేసుకుపోయింది. దాంతో ఆర్‌సీబీ అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తుండగా.. ముంబై ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ముంబై అభిమానుల ముఖ చిత్రం ఏంటోనని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications