రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే వేదికగా 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌తో ఈ ఫీట్ సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీకి ఇది 100వ మ్యాచ్.
18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మరే జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు. కోల్‌కతానైట్‌రైడర్స్(KKR), ముంబై ఇండియన్స్(MI) తమ హోమ్ గ్రౌండ్స్ 90 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐపీఎల్ 2008లో ఇదే రోజు(ఏప్రిల్ 18న) చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ తొలి మ్యాచ్ ఆడింది. సరిగ్గా 18 ఏళ్ల తర్వాత ఇదే రోజు చిన్నస్వామి స్టేడియం వేదికగా 100వ మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది.

ఈ 100 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ 49 గెలిచి 46 మ్యాచ్‌ల్లో ఓడింది. 4 మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ 98 మ్యాచ్‌లు ఆడి 54 గెలిచింది. 42 మ్యాచ్‌ల్లో ఓడిన కేకేఆర్.. రెండింటిలో ఫలితాలు తేలలేదు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై 95 మ్యాచ్‌లు ఆడి 58 గెలిచింది. మరో 37 మ్యాచ్‌ల్లో ఓడింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా 89 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 39 గెలిచి 49 మ్యాచ్‌ల్లో ఓడింది. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ 80 మ్యాచ్‌లు ఆడి 53 గెలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. టీమ్ డేవిడ్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) పర్వాలేదనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ టోర్నీలో ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శుభారంభం చేసిన ఆర్‌సీబీ సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్‌లను ఓడించింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం ఓటమిపాలైంది.