Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబైని వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ చరిత్ర సృష్టించింది. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ ధాటిన తొలి జట్టుగా నిలిచింది. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 'హౌలిహాన్ లోకీ' విడుదల చేసిన స్టడీ ప్రకారం.. ఆర్‌సీబీ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగి 312 మిలియన్ డాలర్లకు చేరింది. దాంతో ముంబై ఇండియన్స్‌ను వెనక్కి నెట్టిన ఆర్‌సీబీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

గౌతమ్ గంభీర్‌తో ఆర్‌సీబీ ఆటగాళ్లకు అన్యాయం!

గౌతమ్ గంభీర్‌తో ఆర్‌సీబీ ఆటగాళ్లకు అన్యాయం!

ఐపీఎల్ మొత్తం విలువ తొలిసారి 20.6 బిలియన్ డాలర్లకు చేరి సరికొత్త మైలురాయిని అందుకుంది. వరుసగా రెండు టైటిళ్లు గెలవడంతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్‌లోను ఛాంపియన్‌గా నిలవడం.. భారీ సంఖ్యలో అభిమానులు ఉండటం, బలమైన వాణిజ్య ఒప్పందాలు ఆర్‌సీబీ విలువ పెరగడానికి ప్రధాన కారణాలని ఈ రిపోర్ట్ పేర్కొంది.

PL 2026 RCB Creates History Becomes First Franchise to Surpass 300 Million in Brand Value

ఆర్‌సీబీ తర్వాత ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ 245 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది. ధోనీ లేకపోవడం, వరుస పరాజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 244 మిలియన్ డాలర్లకే పరిమితమై నాలుగో స్థానంలో నిలిచింది.

168 మిలియన్ డాలర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ రాయల్స్(161 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్(158 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్(157 మిలియన్ డాలర్లు), ఢిల్లీ క్యాపిటల్స్(156 మిలియన్ డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్(122 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

IPL 2027: కావ్య మారన్ ట్రేడ్ డీల్.. SRHలోకి ఆర్‌సీబీ ప్లేయర్‌!

IPL 2027: కావ్య మారన్ ట్రేడ్ డీల్.. SRHలోకి ఆర్‌సీబీ ప్లేయర్‌!

ఈ రిపోర్ట్ ప్రకారం 2023లో 15.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ బ్రాండ్ విలువ.. 2024లో 16.4 బిలియన్ డాలర్లు, 2025లో 18.5 బిలియన్ డాలర్లకు పెరిగి, ఇప్పుడు 20.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలతో కలిపి 2026 సీజన్ ఆదాయం 1.8 బిలియన్ డాలర్లను దాటిందని అంచనా వేసింది. 2028 నుంచి అమల్లోకి వచ్చే కొత్త మీడియా హక్కుల ఒప్పందం ద్వారా ఐపీఎల్ విలువ మరింత పెరిగే అవకాశముందని ఈ రిపోర్ట్ పేర్కొంది.

Story first published: Wednesday, July 29, 2026, 18:47 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+