Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పంజాబ్ కింగ్స్ ఔట్.. ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ..23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత బౌలింగ్‌లో దుమ్మురేపింది. ఈ గెలుపుతో ఆర్‌సీబీ 18 పాయింట్లో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటంగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్), విరాట్ కోహ్లీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో చెలరేగగా..దేవదత్ పడిక్కల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45)పర్వాలేదనిపించాడు. టీమ్ డేవిడ్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/35) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు.

IPL 2026 RCB Becomes First Team to Qualify for Playoffs After Defeating PBKS by 23 Runs
Photo Credit: IPL 2026: RCB Becomes First Team to Qualify for Playoffs After Defeating PBKS by 23 Runs

అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించిగా.. సూర్యాన్ష్ షెడ్గే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ (3/36) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజెల్ వుడ్, సుయాష్ శర్మ, రొమారియోషెపెర్డ్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 17, 2026, 19:47 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+