Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHకు కనీస సోయి లేదు: రవిచంద్రన్ అశ్విన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మ్యాచ్‌పై కనీస అవగాహన లేకుండా ఆడి మూల్యం చెల్లించుకున్నారని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. జోఫ్రా ఆర్చర్ మినహా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌లో అంత పవర్ లేదని ఈ విషయాన్ని గ్రహించకుండా చెత్త షాట్స్ ఆడారని అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఉండి ఉంటే రవీంద్ర జడేజా, యశ్ రాజ్ పుంజా ఆలస్యంగా బౌలింగ్‌కు వచ్చేవారని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ట్రావిస్ హెడ్ విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పునరాలోచన చేయాలన్నాడు.

IPL 2026 Ravichandran Ashwin Says Complete Lack of Game Awareness Cost SRH a Spot in the Final

'ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ పూర్తిగా విఫలమయ్యాడు. ట్రావిస్ హెడ్ విషయంలో SRH మేనేజ్‌మెంట్ పునరాలోచన చేయాలి. వారు అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడం బాలేదు. అతను పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపించాడు. అతనికి ఏమైనా గాయం సమస్య ఉందా? ఎలిమినేటర్ మ్యాచ్‌లో అతను ఎలాంటి ఆలోచన లేకుండా అనవసరమైన రిస్క్ తీసుకున్నాడు. అతను ఆర్చర్‌ను ఎదుర్కొని నిలబడాల్సింది. 15వ ఓవర్ వరకు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లోనే ఉంది.

ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లో మరోసారి అవగాహన లోపంతో ఆడి తప్పు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో ఇలా చాలాసార్లు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన డే గేమ్‌లో కూడా వారు వికెట్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మంచి స్టార్ట్ లభించినప్పటికీ కుప్పకూలారు.

తమ ముందు ఉన్న పరిస్థితి ఏంటో వారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. జోఫ్రా ఆర్చర్ మినహా రాజస్థాన్ బౌలింగ్‌లో అంత పదును లేదు. మైదానంలో లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు జడేజా, యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌కు రారు. ఈ లాజిక్‌ను గ్రహించని సన్‌రైజర్స్.. కేవలం మ్యాచ్‌పై కనీస అవగాహన లేకుండా భారీ మూల్యం చెల్లించుకుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 28, 2026, 15:29 [IST]
Other articles published on May 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+