IPL 2026: రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.. రాజస్థాన్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ భారీ విజయంతో ఏడో గెలుపును ఖాతాలో వేసుకున్న గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది.
మరోవైపు రాజస్థాన్ ఐదో స్థానానికి పడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటితే.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ తన స్పిన్‌తో తిప్పేసాడు.

రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రవీంద్ర జడేజా(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. కగిసో రబాడ రెండు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(3/12) మూడు వికెట్లు తీసాడు. మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
గెలిపించిన గిల్, రషీద్ ఖాన్..
బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ లక్ష్యాన్ని అందించగా.. రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. ఒకే ఓవర్‌లో ధ్రువ్ జురెల్(24)తో పాటు డోనవన్ ఫెరీరా(4)ను ఔట్ చేసిన రషీద్ ఖాన్.. రాజస్థాన్ రాయల్స్‌కు కోలుకోలేని దెబ్బతీసాడు. విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పవర్ ప్లేలోనే ఔట్ చేసి సిరాజ్ మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్ వైపు మలుపు తిప్పాడు. ఓపెనర్ల వైఫల్యంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చేతులెత్తేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications