IPL 2026: రెండు సార్లు టాస్ .. రిఫరీపై శుభ్‌మన్ గిల్ ఆగ్రహం! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో గందరగోళం నెలకొంది. టాస్ రెండు సార్లు వేయడం తీవ్ర వివాదాస్పమైంది. మ్యాచ్ రిఫరీ తీరుపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసహనం వ్యక్తం చేశాడు.
శుభ్‌మన్ గిల్ కాయిన్ స్పిన్ చేయగా రియాన్ పరాగ్ 'హెడ్స్' అని చెప్పగా టెయిల్స్ పడింది. కానీ అది తనకు వినిపించలేదని, టాస్ మళ్లీ వేయాలని రిఫరీ చెప్పాడు. అయితే తనకు వినిపించిందని, పరాగ్ హెడ్స్ చెప్పారని గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరికి రవిశాస్త్రి కల్పించుకొని మరోసారి టాస్ వేయాలని కోరడంతో గిల్ కాయిన్ స్పిన్ చేశాడు. ఈసారి కూడా పరాగ్ హెడ్స్ చెప్పగా అదే పడింది. మ్యాచ్ ఫలితం తర్వాత ఈ టాస్ వివాదంపై మరింత దుమారం రేగే అవకాశం ఉంది.

టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టునే విజయం వరిస్తుందని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఈ వికెట్‌పై ఇప్పటికే 40 ఓవర్ల ఆట పూర్తయింది. కాబట్టి ఇది పెద్దగా మారబోదని మేం భావిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ.. రియాన్ పరాగ్ చేసిన కాల్‌ను మ్యాచ్ రెఫరీ సరిగ్గా వినలేదని నేను అనుకుంటున్నాను
ఈ మ్యాచ్‌లో గెలవడం మాకు అత్యంత ముఖ్యం. ఇది మాకు డూఆర్ డై పరిస్థితి. మా జట్టులోని ప్రతీ ఒక్కరూ పూర్తి జోష్‌లో ఉన్నారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. సాయి కిషోర్ బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications