కోహ్లీ కాదు.. ఆ స్టన్నింగ్ క్యాచ్ వల్లే గెలిచాం: రజత్ పాటిదార్
బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. తమ విజయానికి గల కారణాలను వెల్లడించాడు. బౌలింగ్ విభాగంలో ప్రతీ ఒక్కరు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.
బౌలర్లు సత్తా చాటారు..
'మా బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. టాస్ గెలవడం కూడా మాకు కలిసొచ్చింది. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బంతులు వేసిన తీరు అమోఘం. కృనాల్ పాండ్యా ఎలాంటి బంతులు వేస్తాడో నాకూ తెలియదు. కానీ అతను చాలా ధైర్యవంతమైన బౌలర్ అని మాత్రం చెప్పగలను. అదే సమయంలో, సుయాష్ శర్మ స్టంప్-టు-స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేసిన విధానం కూడా అద్భుతం.
కొత్త బంతితో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్ అదరగొట్టారు. ఒక కెప్టెన్‌గా ఇలాంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే నా పని చాలా తేలికవుతుంది. ఎందుకంటే తదుపరి ఓవర్‌లో ఏం చేయాలో వారికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారి అనుభవం, ఆలోచనలు జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో సహాయపడుతున్నాయి.

అది గొప్ప క్యాచ్..
ఈ సీజన్ ఆరంభం నుంచే మా ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. దానికి తగ్గట్టుగానే ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. అతను సాధారణంగానే వన్-హ్యాండెడ్ క్యాచ్‌లు, గాలిలో ఎగురుతూ పట్టే క్యాచ్‌లను అద్భుతంగా అందుకుంటాడు. ఈ రోజు అతను పట్టిన క్యాచ్ నిజంగా గొప్పది. టైటిల్ గురించి ఆలోచించడం లేదు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రస్తుతానికి మేం ఒక్కో మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెడుతున్నాం.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
రాణించిన కోహ్లీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్ బదోని(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), ముకుల్ చౌదరి(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్(4/24)తో పాటు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(3/27) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్‌వుడ్(1/20)కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఆర్‌సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రజత్ పటిదార్(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27), జితేష్ శర్మ(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) దూకుడుగా ఆడారు.
లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/32) మూడు వికెట్లు తీయగా.. ఆవేష్ ఖాన్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. లక్నో మూడో ఓటమితో ఏడో స్థానానికి పడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications