ఆ ఇద్దరి వల్లే ఈ విజయం.. కోహ్లీ గాయం గురించి తెలియదు: రజత్ పాటిదార్
సమష్టి ప్రదర్శనతోనే ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ-ఫిల్ సాల్ట్ అందించిన శుభారంభం.. ఈ మ్యాచ్‌లో తాము ఆధిపత్యం చెలాయించేలా చేసిందని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై మాట్లాడిన రజత్ పటీదార్.. విరాట్ కోహ్లీ గాయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని తెలిపాడు. ముంబై గడ్డపై విజయం సాధించడం ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని చెప్పాడు.
నాకు పేస్ బౌలింగే ఇష్టం..
'ఈ వాంఖడే మైదానంలో ఆడినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోంది. మా బ్యాటింగ్ ప్రదర్శన గురించి చెప్పాలంటే.. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ బాధ్యతలపై పూర్తి స్పష్టత ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు మమ్మల్ని ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించేలా చేసింది. ఆ తర్వాత నేను, టీమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాం.

ఈ విజయం పూర్తిగా జట్టు సమిష్టి కృషి. నిజం చెప్పాలంటే.. నాకు స్పిన్ ఆడటం అంటే ఇష్టమని అందరూ అంటుంటారు. కానీ నన్ను అడిగితే నాకు పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడమే ఇష్టమని చెబుతాను. ఈ వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లను ఆడటం చాలా బాగుంటుంది. కాబట్టి నాకు ఫాస్ట్ బౌలింగ్ అంటేనే మక్కువ. విరాట్ కోహ్లీ గాయం గురించి ప్రస్తుతానికి నాకు పూర్తి సమాచారం లేదు. కానీ అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని నేను అనుకుంటున్నాను.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
రజత్ పాటిదార్ విధ్వంసం
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50), రజత్ పాటిదార్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్(31 బంతుల్లో ఫోర్, 9 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 40),ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ(2/47) రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, జాకోబ్ డఫీ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications