Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ X ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉప్పల్‌లో ఉదయం చిరు జల్లులతో కూడిన వర్షం పడింది. కానీ ఆ తర్వాత ఎప్పటిలానే ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం 4.30 గంటల తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ఎండలు తగ్గి.. వేడి గాలులు వీస్తున్నాయి. మ్యాచ్ సమయానికి వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

IPL 2026 Rain Threat Looms Over Sunrisers Hyderabad vs Delhi Capitals Clash in Hyderabad

ప్రస్తుతానికి ఉప్పల్‌లో వర్షం లేకున్నా.. ఆకాశాన్ని మబ్బులు కమ్మేసాయి. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మైదానం సిబ్బంది కవర్లతో సిద్దంగా ఉన్నారు. మరోవైపు ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తారు. వర్షం అంతరాయం కలిగిస్తుందేమోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే వర్షం పడినా కాసేపే కురుస్తుందని, మ్యాచ్‌పై ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు మీద ఉంది. ఆరంభంలో ఓటములు ఎదుర్కొన్న గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్‌లో ఉంది. ముఖ్యంగా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగం అనామక పేసర్లతో పటిష్టంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటుతోంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌లపై తక్కువ స్కోర్లను కాపాడుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే జోరును కొనసాగించి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Tuesday, April 21, 2026, 17:09 [IST]
Other articles published on Apr 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+