Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కేకేఆర్ X పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో కోల్‌కతా వేదికగా ప్రారంభం కావాల్సిన కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ సమయానికి భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వర్షం లేకపోయినా.. మ్యాచ్ మొదలయ్యే సమయానికి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వగా.. పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీద ఉంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, పతిరన లాంటి టాప్ బౌలర్లు దూరం కావడంతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది.

IPL 2026 Rain Threat Looms Over KKR vs PBKS Clash at Eden Gardens Kalbaisakhi Storm Could Play Spoilsport

ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా బంతితో విఫలమై ఓడిన కోల్‌కతా.. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరులో బంతితో మరోసారి భారీ పరుగులు సమర్పించుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో పాటు (-1.964) పేలవ రన్‌రేట్‌తో పాయింట్స్‌ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.

స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కావడం జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు పంజాబ్ ఏ మేర పోటీనిస్తుందో చూడాలి. మరోవైపు గుజరాత్ టైటాన్స్‌‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్.. తర్వాతి పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. అదే జోరులో కేకేఆర్‌ను ఓడించి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. కానీ ఇరు జట్లను వర్షం భయపెడుతోంది.

Story first published: Monday, April 6, 2026, 17:19 [IST]
Other articles published on Apr 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+