Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాన్ తప్పులేదు.. మీ ఈగో పక్కన పెట్టండి బాస్: అశ్విన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌‌కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. ఇషాన్ కిషన్ చేసిన విజిల్ సెలెబ్రేషన్స్‌లో ఎలాంటి తప్పిదం లేదన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ అహంకారాన్ని పక్కనపెట్టి ఆ సెలెబ్రేషన్స్‌ను ఆస్వాదించాలని సూచించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా సీఎస్‌కే దాదాపు నిష్క్రమించింది.

ప్యాకప్ అవ్వండంటూ..

ఈ విజయానంతరం సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఇషాన్ కిషన్ ఎగతాళి చేశాడు. ఇంటికెళ్లి విజిల్స్ వేసుకోవాలని, త్వరగా ప్యాకప్ అవ్వండని సైగలు చేశాడు. అయితే ఇషాన్ కిషన్ చేసిన ఈ పనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఇది అనైతిక చర్య అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

IPL 2026 R Ashwin Urges CSK Fans Not to Take Ishan Kishan s Pack Up Celebration Personally

సీఎస్‌కే ఫ్యాన్స్‌ను అగౌరవపర్చడమేనని, వచ్చే సీజన్‌లో కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ఈ ఘటనను భూతద్దంలో చూడకుండా వినోదపరమైన విషయంగా చూడాలని సీఎస్‌కే ఫ్యాన్స్‌కు సూచించాడు.

ఇషాన్ తప్పులేదు..

'ఈ రోజు అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. కానీ ఇషాన్ సెలెబ్రేషన్స్ గురించి మరీ అంత లోతుగా మాట్లాడను. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్ సెలబ్రేషన్స్ గురించి సోషల్ మీడియా‌లో చాలా చర్చ జరుగుతోంది. ఆ సెలెబ్రేషన్స్ గురించి వదిలేయండి ఫ్రెండ్స్. వీరంతా క్రీడాకారులు. భావోద్వేగాలు ఆటలో భాగమే. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. కేవలం ఆటను ఆస్వాదించండి.

ఇక్కడ ఆడే ప్రతి ఆటగాడు క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవాడే. ఒక ఆటగాడు వచ్చి మీ ముందు సెలబ్రేట్ చేసుకున్నాడు. అందులోకి అహాన్ని ఎందుకు తీసుకురావడం? వదిలేయండి. అతని సెలెబ్రేషన్స్‌ను ఆనందించండి. ఇలాంటివి లేకపోతే ఆటలో మజా, డ్రామా ఏం ఉంటుంది?

హైదరబాద్‌కు వెళ్లి కొట్టండి..

అయితే ఇషాన్ తన సెలబ్రేషన్స్ విషయంలో కొంచెం కంట్రోల్‌లో ఉండాలి. ప్రేక్షకుల వైపు చూస్తూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేనైతే దీన్ని ఆస్వాదించాను. ఇతర జట్లు చెపాక్ మైదానంలో సీఎస్‌కేను ఓడించడం అంత సులువు కాదు. కానీ సన్‌రైజర్స్ అది చేసి చూపించింది. గత మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత వారు బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ మ్యాచ్ గెలిచారు.

కాబట్టి వారి సెలెబ్రేషన్స్‌ను వదిలేయండి. అతను మీ హోమ్ గ్రౌండ్‌కు వచ్చి మిమ్మల్ని ఓడించానని చెబుతున్నాడు. అంతకుమించి అందులో ఏం లేదు. అభిమానులుగా.. ఒక జట్టుగా దీన్ని మనసులో ఉంచుకోండి. వచ్చేసారి మీరు హైదరాబాద్‌కి వెళ్లి వారిని ఓడించి బదులుతీర్చుకోండి. కానీ చాలా గౌరవప్రదమైన పద్దతిలో చేయండి.’అని అశ్విన్ సూచించాడు.

Story first published: Tuesday, May 19, 2026, 16:54 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+