Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీకి దిష్టి తగలకుండా చూసుకోండి: అశ్విన్

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి దిష్టి తగలకుండా చూసుకోవాలని అతని తల్లిదండ్రులకు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ మానసిక పరిపక్వతపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. పరిస్థితులకు అనుగుణంగా మారే అతని సామర్థ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడాడు.

IPL 2026 R Ashwin Says Protect Him From Evil Eye in a Special Message to Vaibhav Sooryavanshi s Parents
Photo Credit: X (twitter)

'వైభవ్ సూర్యవంశీ వయసును సాకుగా చూపించదలచుకోలేదు. కానీ 15 ఏళ్ల వయసులోనే అతను ఈ స్థాయి మానసిక పరిపక్వత పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని తక్కువ మ్యాచ్‌ల్లోనే అతను ఆడుతున్న విధానం చూడముచ్చటగా ఉంది. థర్డ్ మ్యాన్ పైగా అతను కొట్టిన సిక్సర్‌ను చూస్తే.. ఈ సీజన్ ప్రారంభంలో అదే బంతిని స్ట్రైట్‌గా ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు.

ఒక సీజన్ లోపలే 15 ఏళ్ల వయస్సులోనే అతను తన బ్యాటింగ్‌లో మార్పులు చేసుకున్నాడు. అతను అసాధారణ ఆటగాడు. అతని తల్లిదండ్రులు అతనికి దిష్టి తగలకుండా ఏమైనా చేయాలి. మ్యాచ్ అనంతరం సెంచరీ గురించి తాను పట్టించుకోలేదని వైభవ్ చెప్పాడు. కేవలం జట్టు కోసం విజయాన్ని అందించేందుకే ప్రయత్నించానని చెప్పాడు. అతని బ్యాటింగ్ చేసే విధానం చూస్తే.. శతకాల గురించి అతనికి పట్టింపు లేదని తెలుస్తోంది. ఒత్తిడిలో అతను ఎలా ఆడతాడనే దానిపై సందేహం ఉండేది. కానీ అతను అద్భుతంగా ఆడాడు’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ కలిగిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. కానీ ఆ జట్టునే వైభవ్ సూర్యవంశీ చీల్చి చెండాడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు.

Story first published: Thursday, May 28, 2026, 18:46 [IST]
Other articles published on May 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+